AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలికి చిన్న గాయం.. ఎలుక కరిచిందేమో అని లైట్ తీసుకుంది.. కొన్ని గంటలు గడిచేసరికి..!

పాము కాటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో చోటుచేసుకుంది.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన సింధుజ(17) ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఇల్లు శుభ్రం చేస్తున్న క్రమంలో పాము కాటుకు గురైంది. ఎలుక కరిచిందని భావించిన కుటుంబసభ్యులు నిర్లక్ష్యం చేశారు.

కాలికి చిన్న గాయం.. ఎలుక కరిచిందేమో అని లైట్ తీసుకుంది.. కొన్ని గంటలు గడిచేసరికి..!
Student Dies With Snakebite
P Shivteja
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 9:54 PM

Share

పాము కాటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో చోటుచేసుకుంది.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన సింధుజ(17) ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఇల్లు శుభ్రం చేస్తున్న క్రమంలో పాము కాటుకు గురైంది. ఎలుక కరిచిందని భావించిన కుటుంబసభ్యులు నిర్లక్ష్యం చేశారు. పాము కాటును సీరియస్ గా తీసుకోకుండా ఉండడంతో సాయంత్రం ఆమె నోటి నుంచి నురగలు రావడంతో భయాందోళనలకు గురయ్యారు. వెంటనే గమనించిన కుటుంబీకులు హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే బాలిక పరిస్థితి విషమించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం సూచించారు. దీంతో హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (మార్చి 20) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా సింధుజ దౌల్తాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఒకేషనల్ కోర్సు చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సింధుజ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే