ఆ ఆకులను గుర్తుపట్టారా? మీ గుండె ఆయుష్షుకు ఇవి శ్రీరామరక్ష..
20 March 2026
TV9 Telugu
TV9 Telugu
పాలకూర.. ఈ పేరు వింటేనే చాలా మంది ముఖం చిట్లించేస్తారు. అందుకు కారణం.. ఇది రుచి. రుచికి గడ్డిలా ఉన్నా.. పాల కూర చేసే మేలు అంతా ఇంతా కాదు
TV9 Telugu
మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. తాజా పాలకూర కట్టలో 100 గ్రాములకు సుమారు 4.4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది
TV9 Telugu
రక్తహీనతతో బాధపడే వారు పాలకూరను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడే వారికి పాలకూరను తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు
TV9 Telugu
పాలకూరలో విటమిన్ ఎ, సి, కె, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం గడ్డకట్టడంలో, ఎముకలను దృఢంగా చేయడంలో కూడా పాలకూర మనకు సహాయపడుతుంది
TV9 Telugu
పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను కాపాడడంలో కూడా ఇవి మనకు దోహదపడతాయి
TV9 Telugu
కనుక పాలకూరను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. పాలకూర గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు గుండెపై ఒత్తిడి కూడా తగ్గుతుంది
TV9 Telugu
పాలకూరలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి, దీనిలో థైలాకోయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గడంలో పాలకూర మనకు ఎంతో దోహదపడుతుంది
TV9 Telugu
పాలకూరను ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. అలాగే పాలకూరను వండేటప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత మీద పాలకూరను ఉడికించడం వల్ల పోషకాలు నశిస్తాయి