AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Drinks: మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా!

వేసవి తాపం నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి చాలా మంది నీటి శాతం ఎక్కువగా ఉండే కాలానుగుణ పండ్లు, ఆకుకూరలను తింటారు. అంతేకాకుండా కొన్ని పానీయాలను తీసుకోవడం ద్వారా కూడా వేసవి అలసటను కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Summer Drinks: మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా!
Summer Drinks
Srilakshmi C
|

Updated on: Mar 20, 2026 | 9:34 PM

Share

వేసవిలో తీవ్రమైన వేడి కారణంగా డీహైడ్రేషన్, అలసట, నీరసం, ఒళ్ళు నొప్పులు, వడదెబ్బ, జీర్ణ సమస్యలతో సహా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించాలి. కాబట్టి ఈ సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి చాలా మంది నీటి శాతం ఎక్కువగా ఉండే కాలానుగుణ పండ్లు, ఆకుకూరలను తింటారు. అంతేకాకుండా కొన్ని పానీయాలను తీసుకోవడం ద్వారా కూడా వేసవి అలసటను కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

నిమ్మ షర్బత్ – ఆమ్ పన్నా

వేసవిలో దాహాన్ని తీర్చడానికి నిమ్మ షర్బత్ ఒక మంచి మార్గం. దీనిలోని విటమిన్ సి, ఎలక్ట్రోలైట్లు తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా పచ్చి మామిడితో చేసిన ఆమ్ పన్నాను కూడా తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా వడదెబ్బ నుంచి రక్షించడంలో కూడా సహాయపడతాయి.

పుదీనా, దోసకాయ షర్బత్

వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి పుదీనా, దోసకాయతో చేసిన పానీయం తాగడం ఉత్తమం. ఈ రెండింటిలోనూ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఎక్కువ సేపు హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి పోషణను అందించడమే కాకుండా వేడి నుంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నీళ్ళు

ఇందులో పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక ముఖ్యమైన మూలకాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. కాబట్టి వేసవిలో రోజుకు ఒకసారి కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శక్తి స్థాయిలను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

చెరకు రసం

వేసవి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో చెరకు రసం ఒకటి. ఇందులో గ్లూకోజ్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

మజ్జిగ

ఈ వేసవిలో మజ్జిగ తాగడం కూడా చాలా మంచిది. ఇది కడుపుకు చల్లదనాన్ని, తాజాదనాన్ని ఇస్తుంది. మజ్జిగ శరీరాన్ని చల్లబరచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పుష్కలంగా నీళ్లు తాగాలి

వేసవిలో అత్యంత ముఖ్యమైన విషయం పుష్కలంగా నీళ్లు తాగడం మంచిది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతిరోజూ సుమారు రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి. శారీరక శ్రమ చేసేవారు ఇంకా ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్, మొబైల్స్ దొంగతనం!
బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్, మొబైల్స్ దొంగతనం!
ఈ ఆకులు కూరల్లో వేస్తే ఘుమఘుమలేకాదు మీ ఆరోగ్యానికీ ఎంతో మేలు..!
ఈ ఆకులు కూరల్లో వేస్తే ఘుమఘుమలేకాదు మీ ఆరోగ్యానికీ ఎంతో మేలు..!
నా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా రెడీ అయ్యింది
నా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా రెడీ అయ్యింది
పండగ పూట పోచమ్మ తల్లి ఆలయంలో నాగు పాము అద్భుత దర్శనం
పండగ పూట పోచమ్మ తల్లి ఆలయంలో నాగు పాము అద్భుత దర్శనం
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన