AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మహానగరంలో ఖతర్నాక్‌ కంత్రీగాడు.. గోల్డ్‌ షాపుల్లో ఏం చేస్తున్నాడో చూడండి! వీడియో

హైదరాబాద్ మహానగరంలోని పలు బంగారం షాపుల్లో ఓ ప్రబుద్ధుడు చాకచక్యంగా ఉంగరాలు కొట్టేశాడు. ఇలా జ్యువెల్లరీ షాపులకు నగలు కొనేందుకు వచ్చినట్లు నటించి, నింపాదిగా ఒక్కక్క ఆభరణం తీసి చూసేవాడు. ఇంతలో సేల్స్ గర్ల్‌ కళ్లుగప్పి చొక్కా జేబులో ఉంగరాలు దాచేశాడు. ఆనక ఏం తెలియనట్లు ఉడాయించేవాడు..

Viral Video: మహానగరంలో ఖతర్నాక్‌ కంత్రీగాడు.. గోల్డ్‌ షాపుల్లో ఏం చేస్తున్నాడో చూడండి! వీడియో
Kukatpally Jewellery Shop Robbery Case
Srilakshmi C
|

Updated on: Mar 20, 2026 | 6:55 PM

Share

హైదరాబాద్, మార్చి 20: గోల్డ్ నగలు కొనేందుకు బంగారం షాపుకు వచ్చిన ఓ ప్రబుద్ధుడు చాకచక్యంగా ఉంగరాలు కొట్టేశాడు. ఇలా పలు జ్యువెల్లరీ షాపులకు నగలు కొనేందుకు వచ్చినట్లు నటించి, నింపాదిగా ఒక్కక్క ఆభరణం తీసి చూసేవాడు. ఇంతలో సేల్స్ గర్ల్‌ కళ్లుగప్పి చొక్కా జేబులో ఉంగరాలు దాచేశాడు. ఆనక ఏం తెలియనట్లు ఉడాయించేవాడు. ఇలా నగరంలో పలు బంగారం షాపుల్లో చోరీలు చేశాడు. అనుకోని విధంగా ఈ వ్యవహారం బయపటడటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో అసలు కథ బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం..

ఎం సాగర్ (30) అనే వ్యక్తి బంగారం కొనడానికి ఆసక్తి ఉన్న కస్టమర్‌గా నటిస్తూ హైదరాబాద్‌లోని కుకట్‌పల్లిలో ఉన్న బంగారు నగర షాపులో ప్రవేశించాడు. దీంతో షాపు సిబ్బంది సెలక్షన్‌ కోసం అతడి ముందు కొన్ని ఆభరణాలు ఉంచారు. ఇంతలో సిబ్బంది ఇతర కస్టమర్లకు సేవలు అందించేందుకు పక్కకు వెళ్లారు. అదే అదనుగా అతగాడు గోల్డ్‌ ఉంగరాలను దొంగిలించి, వాటి స్థానంలో నకిలీ వాటిని పెట్టాడు. ఇలా ఒక్క షాపులో మాత్రమే కాదు జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య సిటీలోని CMR జ్యువెలర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి ప్రముఖ బంగారు దుకాణాలను సందర్శించారు. ఇలా ఎక్కడెక్కడ ఎన్నెన్ని బంగారు ఆభరణాలు మాయం చేశాడో తెలియదుగానీ.. ఇతగాడి చేతి వాటం ఓ షాపు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో మొత్తం వ్యవహారం బయటపడింది.

ఇవి కూడా చదవండి

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జువెల్లరీ షాపు నుంచి బంగారు ఉంగరాలను దొంగిలించిన ఆరోపణలపై చివరికి కూకట్‌పల్లి పోలీసులు సాగర్‌ను అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us