AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Masala Dosa: దోసెలు తిని బోర్ కొట్టిందా?.. ముక్క ముక్కలోనూ మసాలా తగిలే ఈ ‘చికెన్ దోసె’ ట్రై చేయండి

దోసె అంటే దక్షిణాది వారి ప్రాణం. సాదా, మసాలా, ఉల్లి దోసెలు మనకు పరిచయమే.. కానీ చికెన్ ప్రియుల కోసం ఒక సరికొత్త 'చికెన్ దోసె' సిద్ధమైంది. లోపల ఘుమఘుమలాడే చికెన్ మసాలా, పైన కరకరలాడే దోసె.. ఈ కాంబినేషన్ తింటే స్వర్గం కనిపిస్తుంది. ఆదివారం ఉదయం లేదా రాత్రి డిన్నర్ లో ఏదైనా వెరైటీగా చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. అతి సులభంగా చికెన్ దోసె తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం..

Chicken Masala Dosa: దోసెలు తిని బోర్ కొట్టిందా?.. ముక్క ముక్కలోనూ మసాలా తగిలే ఈ 'చికెన్ దోసె' ట్రై చేయండి
Chicken Dosa Recipe
Bhavani
|

Updated on: Mar 20, 2026 | 9:01 PM

Share

చికెన్ దోసె అనగానే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకోకండి. ఇంట్లోనే ఉండే సాదా దోసె పిండితో, కుక్కర్ లో త్వరగా ఉడికించే చికెన్ గ్రేవీతో దీన్ని అద్భుతంగా సిద్ధం చేయవచ్చు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, మాంసాహారం ద్వారా అందే ప్రోటీన్ల వల్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ స్పెషల్ దోసె తయారీకి కావలసిన పదార్థాలు ఏంటి? చికెన్ ను ఎలా మ్యారినేట్ చేయాలి? దోసెపై మసాలాను ఎలా సెట్ చేయాలి? వంటి పూర్తి వివరాల తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

400 గ్రా చికెన్ (చిన్న ముక్కలు),

ఉల్లిపాయలు,

టొమాటో ప్యూరీ,

అల్లం-వెల్లుల్లి పేస్ట్,

కారం,

పసుపు,

గరం మసాలా,

మిరియాల పొడి,

జీలకర్ర.

దోసె కోసం: దోసె పిండి, నెయ్యి లేదా నూనె.

తయారీ విధానం

కుక్కర్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేయించండి. ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి, టొమాటో పురీ మరియు అన్ని మసాలాలు కలిపి నూనె వేరుపడే వరకు ఉడికించండి.

చిన్నగా కోసిన చికెన్ ముక్కలను వేసి, 3-4 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ లో 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించండి. గ్రేవీ చిక్కగా ఉంటేనే దోసెలోకి బాగుంటుంది.

పెనంపై దోసె పిండిని పలుచగా పరచండి. రెండు వైపులా కాల్చిన తర్వాత మధ్యలో సిద్ధం చేసిన చికెన్ మసాలా పెట్టి మడవండి.

ఫైనల్ టచ్: పైన కొద్దిగా నెయ్యి వేసి, తక్కువ మంట మీద 4-5 నిమిషాలు ఉంచితే క్రిస్పీ చికెన్ దోసె రెడీ!

ప్రయోజనాలు :

ప్రోటీన్ రిచ్: పెరిగే పిల్లలకు, జిమ్ కి వెళ్లే వారికి ఇది మంచి పోషకాహారం.

చిట్కా 1: చికెన్ చాలా చిన్న ముక్కలుగా ఉంటే దోసె లోపల సమానంగా పరుచుకుంటుంది.

చిట్కా 2: వేడి వేడి చికెన్ దోసెను కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

చిన్న చిట్కా: మీకు ఇంకా స్పైసీగా కావాలంటే, దోసె వేసే ముందు పెనంపై కొద్దిగా కారప్పొడి చల్లి, దానిపై చికెన్ మసాలా పెట్టండి.

Follow Us
సరదాగా బీచ్‌కు వెళ్లిన జనం.. తీరంలో కనిపించిన వింత జీవి..
సరదాగా బీచ్‌కు వెళ్లిన జనం.. తీరంలో కనిపించిన వింత జీవి..
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
సామాన్యులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!
సామాన్యులకు బిగ్‌ షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!
Video: గాయపడిన పక్షికి ప్రేమగా ఆహారం తినిపించిన తోటి నేస్తం!
Video: గాయపడిన పక్షికి ప్రేమగా ఆహారం తినిపించిన తోటి నేస్తం!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.4 వేలు తగ్గిన బంగారం ధర..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.4 వేలు తగ్గిన బంగారం ధర..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్స్..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్స్..
మెడికల్ మిరకిల్‌ : అవయవ మార్పిడి అవసరం లేని ప్రయోగం
మెడికల్ మిరకిల్‌ : అవయవ మార్పిడి అవసరం లేని ప్రయోగం