రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడటానికి జపాన్ నుంచి మాసామి, క్రిస్ అనే ఇద్దరు అభిమానులు హైదరాబాద్ వచ్చారు. గతంలోనూ చరణ్‌ను కలిసిన వీరు, లక్షల రూపాయలు ఖర్చు చేసి, ఓటీలు చేసి డబ్బులు కూడబెట్టి ఈ ప్రయాణం చేశారు. మూడు రోజుల్లో పదిసార్లు సినిమా చూడాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.