AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం పోయే కాలంరా.. కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్‌

ఇదేం పోయే కాలంరా.. కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్‌

Phani CH
|

Updated on: Jun 06, 2026 | 6:05 PM

Share

జల్సాల కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు రైతుల ధాన్యాన్ని టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగుచూసింది. ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని రాత్రివేళల్లో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని దొంగిలించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లో 242 బస్తాలు లూటీ చేసిన ఈ గ్యాంగ్ నుంచి నగదు, కార్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

జల్సాల కోసం అన్నదాతల పొట్టకొడుతూ, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం టార్గెట్ చేసుకుని కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పరకాల ఏసీపీ సతీష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లాకు చెందిన ప్రతీక్, అస్లాం, రాహుల్ అనే ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు జల్సాలకు అలవాటు పడి ఈ ధాన్యపు దొంగతనాలకు స్కెచ్ వేశారు. వీరు సెల్ఫ్ డ్రైవింగ్ కోసం ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని, రాత్రి సమయాల్లో హైవేలు, రహదారుల వెంట రైతులు ఆరబోసిన ధాన్యంపై నిఘా వేసేవారు. రైతులు లేని సమయం చూసి దర్జాగా కార్లలో ధాన్యం బస్తాలను లూటీ చేసేవారు. ఈ చోరీల కోసం ముగ్గురు నేపాలీ మైనర్లు, ఒక యువతి సహా మరో నలుగురిని వీరు ఎంగేజ్ చేసుకున్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 15 మంది రైతులకు చెందిన 242 ధాన్యం బస్తాలను ఈ ముఠా లూటీ చేసింది. ఈ దొంగతనాల వల్ల రైతులు ఒకరినొకరు అనుమానించుకుంటూ ఘర్షణ పడే వాతావరణం నెలకొంది. ఇటీవల శాయంపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేటుగాళ్ల గుట్టురట్టు చేశారు. ధాన్యాన్ని దూర ప్రాంతాల్లోని రైస్ మిల్లుల్లో అమ్మి, వచ్చిన సొమ్మును రాహుల్ ఇంట్లో దాచి, తర్వాత పంచుకోవాలని ప్లాన్ చేశారు. అయితే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ. 3,05,200 నగదు, రెండు కార్లు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారంతా 21 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫేక్‌ కాల్స్‌ భరతం పట్టనున్న గూగుల్‌.. ఎలా అంటే!

దారుణం.. చిన్నారి కాలి ఎముకను విరగ్గొట్టిన డాక్టర్‌.. కారణం ఇదే

ఐఆర్‌సీటీసీ బిగ్ ఆపరేషన్.. 3 కోట్ల అకౌంట్లు బ్లాక్

చెట్టుపైనుంచి నోట్ల వర్షం కురిపించిన కోతి.. వానరం ఎంత పని చేసింది!

ఏఐ వద్దు.. ఉద్యోగులే ముద్దు.. పెరిగిన ఏఐ ఖర్చు.. కంపెనీల పునరాలోచన

Follow Us