AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిడుగుపాటును ముందే చెప్పేసే.. ‘దామిని’ యాప్!

పిడుగుపాటును ముందే చెప్పేసే.. ‘దామిని’ యాప్!

Phani CH
|

Updated on: Jun 06, 2026 | 6:49 PM

Share

పిడుగుపాట్ల వల్ల ప్రతి ఏడాది అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ రూపొందించిన ‘దామిని’ యాప్ ఉపయోగపడుతోంది. 20-40 కిలోమీటర్ల పరిధిలో పిడుగు పడే అవకాశాన్ని గుర్తించి రంగుల హెచ్చరికల ద్వారా సమాచారం అందిస్తూ ప్రజలు, రైతులకు ప్రాణరక్షక సాధనంగా మారుతోంది.

ఏటా వేసవి కాలంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విపత్తు నుండి ప్రజలను సకాలంలో అప్రమత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థలు మొబైల్‌ ఫోన్లకు సందేశాలు పంపుతున్నా.. సరైన అవగాహన లేక ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. అయితే, ఇకపై మన స్మార్ట్‌ఫోన్ ద్వారానే పిడుగుపాటును ముందే గుర్తించేలా ‘దామిని’ యాప్ అందుబాటులోకి వచ్చింది. పుణెలోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ’ ఈ యాప్‌ను రూపొందించింది. ఇది మనమున్న ప్రాంతానికి 20 నుండి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగు పడే అవకాశాన్ని క్షణాల్లో గుర్తిస్తుంది. ఈ యాప్‌లో మన కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లు నమోదు చేస్తే వారిని కూడా అలర్ట్ చేస్తుంది. యాప్‌లో నీలం, పసుపు, ఎరుపు రంగులతో మనకు హెచ్చరికలు పంపుతుంది. నీలం రంగుతో అలర్ట్‌ వస్తే ఆ ప్రాంతంలో మరో 21 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉందని అర్థం. పసుపు రంగులో హెచ్చరిక వస్తే వచ్చే 14 నిమిషాల్లో ఆ ప్రాంతంలో పిడుగు పడుతుందని గ్రహించాలి. ఇక ఎరుపు రంగులో అలర్ట్‌ వస్తే ఇది అత్యంత ప్రమాదకరం. మరో 7 నిమిషాల్లోనే పిడుగు పడుతుందని, వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచన. ఈ యాప్ ద్వారా పిడుగుపాటు ప్రమాదాల నుండి గ్రామీణ ప్రజలు, రైతులు సులభంగా తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముందు చక్రం ఊడి కుప్పకూలిన విమానం

Weather Update: గెట్ రెడీ.. వరుణుడు వచ్చేస్తున్నాడు! తెలుగు రాష్ట్రాలకు వర్షాల సందడి!

రూ. 2 లక్షల విలువైన పరుపులు ఇచ్చి.. ఎంతోమంది ప్రాణాలను కాపాడిన తండ్రీ కొడుకులు!

ఏఐ గురువులకు ఫుల్ డిమాండ్.. ఒక్క క్లాస్ చెబితే రూ. 23 లక్షల ఫీజు

ఇదేం పోయే కాలంరా.. కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్‌

Follow Us