సూర్యాపేట జిల్లా కోదాడలోని భవానీనగర్‌లో నాగేష్, మాధవి దంపతుల ఇంట్లో భారీ చోరీ జరిగింది. వైద్య పరీక్షల కోసం వెళ్లిన సమయంలో ఇద్దరు దొంగలు ఇంట్లోకి చొరబడి తులంన్నర బంగారం, 60 తులాల వెండి, రూ. 15 వేలు నగదును దోచుకున్నారు. అయితే, ఫ్రిజ్‌లోని థంసప్ కూల్ డ్రింక్‌ను తాగి సీసాలను అక్కడే వదిలేయడం గమనార్హం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.