AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10th, Inter Exams Postponed 2026: రేపటి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలన్నీ వాయిదా.. కారణం ఇదే! కొత్త తేదీలు చూశారా..

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి రెండు పరీక్షలు పూర్తయ్యాయి. మార్చి 21 (శనివారం) ఇంగ్లిష్‌ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. గతంలో ఇచ్చిన సెలవుల జాబితా మేరకు మార్చి 20వ తేదీన రంజాన్‌ పండగ రావల్సి..

10th, Inter Exams Postponed 2026: రేపటి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలన్నీ వాయిదా.. కారణం ఇదే! కొత్త తేదీలు చూశారా..
10th class and Inter Exams postponed over Id ul Fitr Holiday
Srilakshmi C
|

Updated on: Mar 20, 2026 | 2:20 PM

Share

అమరావతి, మార్చి 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి రెండు పరీక్షలు పూర్తయ్యాయి. మార్చి 21 (శనివారం) ఇంగ్లిష్‌ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. గతంలో ఇచ్చిన సెలవుల జాబితా మేరకు మార్చి 20వ తేదీన రంజాన్‌ పండగ రావల్సి ఉంది. అయితే అనూహ్యంగా రంజాన్‌ పండగ తేదీ మారింది. దీంతో ఈ పండగ తేదీ మార్చి 21కి మారింది. ఈ క్రమంలో మార్చి 21న నిర్వహించాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తన ప్రకటనలో విద్యాశాఖ వెల్లడించింది. మిగిలిన పరీక్షలు టైమ్ టేబుల్ ప్రకారం యథావిధిగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. మార్చి 21న రంజాన్‌ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సైతం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం (మార్చి 19) అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. నెల వంక దర్శనం ఆధారంగా రంజాన్‌ పండగ వస్తున్నట్లు రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సీఈవో నుంచి లేఖ రావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మార్చి 21వ తేదీన సెలవు ప్రకటిస్తూ సీఎస్ జి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రంజాన్‌ సెలవు నేపథ్యంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

ఏపీ పదో తరగతి 2026 కొత్త టైం టేబుల్ ఇదే..

  • మార్చి 23 న గణితం పరీక్ష
  • మార్చి 25న ఫిజికల్ సైన్స్ పరీక్ష
  • మార్చి 28న బయోలజీ పరీక్ష
  • మార్చి 30న సోషల్ స్టడీస్‌ పరీక్ష
  • మార్చి 31న ఒకేషనల్ పరీక్ష
  • ఏప్రిల్ 1న ఒకేషనల్ పరీక్ష
  • ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పరీక్ష

రేపు జరగాల్సిన ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు సైతం వాయిదా..

అలాగే మార్చి 21న జరగాల్సిన ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష కూడా వాయిదా పడింది. ఈ పరీక్షను మార్చి 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మిగిలిన పరీక్షలు ఆయా షెడ్యూల్ ప్రకారం యథాతథంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు తాజా మార్పును గమనించాలని విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఏపీకి కేంద్రం శుభవార్త.. ఏంటంటే..?
ఏపీకి కేంద్రం శుభవార్త.. ఏంటంటే..?
క్రేజీ ఉద్యోగం.. జస్ట్ మేఘాలను వీడియో తీస్తూ నెలకు రూ. 8.5 లక్షలు
క్రేజీ ఉద్యోగం.. జస్ట్ మేఘాలను వీడియో తీస్తూ నెలకు రూ. 8.5 లక్షలు
తల్లిదండ్రుల మధ్య హాయిగా నిద్రపోతున్న విజయ్..
తల్లిదండ్రుల మధ్య హాయిగా నిద్రపోతున్న విజయ్..
పాక్‎ను కుప్పకూల్చి బంతిని రెండు ముక్కలు చేసిన ఇంగ్లాండ్ బౌలర్లు
పాక్‎ను కుప్పకూల్చి బంతిని రెండు ముక్కలు చేసిన ఇంగ్లాండ్ బౌలర్లు
ఒంట్లో విటమిన్ డి తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..?
ఒంట్లో విటమిన్ డి తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..?
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర