సమ్మర్ వచ్చేసిందని ఫ్రిజ్‌లో నీళ్లు తాగుతున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్లే!
Samatha
19 march 2026
సమ్మర్ వచ్చేసింది. మార్చి నెల నుంచి ఎండలు ప్రారంభం అయ్యాయి. దీంతో చాలా మంది వేసవి వేడి నుంచి బయటపడటానికి చల్లటి నీరు తాగుతుంటారు.
సమ్మర్
ముఖ్యంగా ఫ్రిజ్ నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. అయితే సమ్మర్‌లో ఫ్రిజ్‌లో నీళ్లు తాగం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టే ప్రమాదం ఉన్నదంట.
ఫ్రిడ్జ్ నీళ్లు
వేసవి తాపం నుంచి బయటపడటానికి, తాత్కాలిక ఉపశమనం కోసం చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి నీరు తాగడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు.
వేసవి తాపం
అయితే ఫ్రిజ్‌లో పెట్టిన నీళ్లు తాగడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ ఉన్నదంట. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్, గొంతు నొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుందంట.
దీర్ఘకాలిక సమస్యలు
ప్రతి రోజూ ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి నీరు తాగడం వలన ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీంతో తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
జీర్ణక్రియ సమస్యలు
అలాగే కొంత మందిలో ఇది దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలను తీవ్రతరం చేస్తుంది.
శ్వాసకోశ సమస్యలు
అలాగే ఫ్రిజ్‌లో పెట్టిన నీళ్లు తాగడం వలన కొంత మందిలో ఇది అలెర్జీ వంటి సమస్యలకు కారణం అవుతుంది. అలాగే జలుబు, జ్వరం వంటి సమస్యలు తలెత్తుతాయి.
అలెర్జీ సమస్యలు
ప్రతి రోజూ ఫ్రిజ్‌లో పెట్టిన నీళ్లు తాగడం వలన బరువు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అందుకే వీలైనంత వరకు ఫ్రిజ్‌లో పెట్టిన నీళ్లు తాగకపోవడమే మంచిదంట.