ఇంట్లో ఈ చెట్టు ఉంటే ఒంట్లో సగం రోగాలు నయమైనట్లే..!

20 March 2026

TV9 Telugu

TV9 Telugu

ప్రతి ఇంట్లో జరిగే పూజలు, శుభకార్యాలు.. శుభకార్యం ఏదైనా వాయనమివ్వడానికి పూలు పండ్లతో పాటు ఎక్కువగా ఉపయోగించేది తమలపాకులే. వీటిని శుభప్రదంగా భావిస్తుంటారు

TV9 Telugu

అయితే శుభకార్యాలకు వాడే తమలపాకులు కొన్ని రకాల అనారోగ్యాల్నీ కూడా దూరం చేస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకు వీటిలోని ఔషధ గుణాలే కారణమట

TV9 Telugu

కొంతమంది తమలపాకులను రోజూ నములుతుంటారు. దీనివల్ల శరీరంలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలుంటే తొలగిపోతాయట. పెద్ద కప్పు నీటిలో కొన్ని తమలపాకులు వేసి నీళ్లు సగమయ్యేంత వరకు మరిగించాలి

TV9 Telugu

ఇలా మరిగించిన నీటిని తాగడం వల్ల కూడా పలు ప్రయోజనాలు పొందచ్చట. ఇవి నోటి దుర్వాసనను దూరం చేస్తాయట. అలాగే చిగుళ్ల నుంచి వచ్చే బ్లీడింగ్‌ని ఆపి.. దంతాలను దృఢపరిచే గుణం తమలపాకులకు ఉందంది

TV9 Telugu

చర్మంపై దురద, అలర్జీ.. మొదలైన సమస్యలను కూడా తమలపాకులు దూరం చేస్తాయట. వీటిలో ఉండే యాంటీసెప్టిక్‌ గుణాలే ఇందుకు కారణమట

TV9 Telugu

గాయాలు మానడానికి తమలపాకుల్ని ఉపయోగిస్తారు. ఈ క్రమంలో కొన్ని తమలపాకుల నుంచి తీసిన రసాన్ని గాయంపై రాసి.. దానిపై మరో తమలపాకును ఉంచి కట్టు కట్టాలి

TV9 Telugu

ఫలితంగా గాయం మానే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. తమలపాకుల్ని నమిలి, ఆ రసాన్ని మింగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అందుకే భోజనం చేశాక తాంబూలం వేసుకోవడం మంచిదంటారు

TV9 Telugu

తమలపాకుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ వంటి పోషకాలు ఉంటాయి. తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్ ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తమలపాకులో షుగర్ లెవల్స్ తగ్గించే సామర్థ్యంతోపాటు బీపీని కూడా సాధారణంగా ఉంచుతుంది