AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Govt Jobs 2026: నిరుద్యోగులకు భలే న్యూస్.. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, 2 సహా 10,060 ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయ్!

AP Job Calendar 2026: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా జాబ్‌ క్యాలెండర్ 2026 విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 10,060 పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదలైంది. ఈ మేరకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నట్లు మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేధికగా ప్రకటించారు. తాజా జాబ్ క్యాలెండర్‌లో వివిధ శాఖల్లో..

APPSC Govt Jobs 2026: నిరుద్యోగులకు భలే న్యూస్.. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, 2 సహా 10,060 ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయ్!
APPSC Job Notification Dates
Srilakshmi C
|

Updated on: Mar 20, 2026 | 4:57 PM

Share

అమరావతి, మార్చి 20: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా జాబ్‌ క్యాలెండర్ 2026 విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 10,060 పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదలైంది. ఈ మేరకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నట్లు మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేధికగా ప్రకటించారు. తాజా జాబ్ క్యాలెండర్‌లో వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను వెల్లడించారు. ఇకపై ఏటా ఉగాదికి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో కూడా జాబ్‌ క్యాలెండర్‌లో వివరాలు విడుదల చేసినట్లు మంత్రి లోకేష్‌ వివరించారు.

జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. మే 15 నుంచి అక్టోబరు 15 వరకు వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీచేస్తామని వివరించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ నెరవేరుస్తామని అన్నారు. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామని, ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్‌గా ఉండాలని వెల్లడించారు. అంతేకాకుండా ఇకపై ప్రతియేటా ఉగాది పండక్కి ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్‌ ప్రకటిస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి

తేదీల వారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలు..

  • ఉన్నత విద్యలో 1500 పోస్టులకు మే 15, 2026న నోటిఫికేషన్‌
  • ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో 91 పోస్టులు, హోంశాఖలో 2,778 పోస్టులు, ఇతర శాఖల్లో 928 పోస్టులకు మే 15, 2026న నోటిఫికేషన్‌
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2లో 250 పోస్టులు, ఇంజనీరింగ్‌లో 503, ఇతర శాఖలు 506 పోస్టులకు సెప్టెంబర్‌ 15, 2026న నోటిఫికేషన్‌
  • పాఠశాల/ఇంటర్ విద్యలో 3004 పోస్టులకు అక్టోబర్ 15, 2026న నోటిఫికేషన్‌

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us