AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Durgha Tej: ‘ఇప్పుడిది నాకు పునర్జన్మ’.. హైదరాబాద్ పోలీసులకు మెగా మేనల్లుడి విరాళం

సరిగ్గా నాలుగేళ్ల క్రితం అంటే 2021 సెప్టెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (పేరు మార్చుకున్నాడు). తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. చాలా రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందిన సాయి అభిమానుల ప్రార్థనలతో తిరిగి కోలుకున్నాడు.

Sai Durgha Tej: 'ఇప్పుడిది నాకు పునర్జన్మ'.. హైదరాబాద్ పోలీసులకు మెగా మేనల్లుడి విరాళం
Sai Durgha Tej
Basha Shek
|

Updated on: Sep 18, 2025 | 10:52 PM

Share

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా హైదరాబాద్‌ పోలీస్‌ విభాగానికి ఆయన రూ. 5లక్షల విరాళం ఇచ్చారు. గురువారం (సెప్టెంబర్ 18) హైదరాబాద్ వేదికగా జరిగిన ‘హైదరాబాద్‌ ట్రాఫిక్‌, రోడ్‌ సేఫ్టీ సమ్మిట్‌ 2025’కు అతిథిగా హాజరైన సాయి దుర్గతేజ్ పోలీసు అధికారులకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెగా హీరో తన యాక్సిడెంట్ అనుభవాలను గుర్తకు తెచ్చుకున్నాడు. ద్విచక్ర వాహనదారులు తప్పనసరిగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశాడు.. ‘2021 సెప్టెంబరులో రోడ్డు ప్రమాదానికి గురయ్యా. రెండు వారాల పాటు కోమాలో ఉన్నా. ఇప్పుడిది నాకు పునర్జన్మ. ఇదంతా నేను సానుభూతి కోసం చెప్పడం లేదు. ఆ రోజు హెల్మెట్‌ ధరించాను కాబట్టే ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడుతున్నాను. బైక్‌ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్‌ పెట్టుకోండి. బైక్‌ డ్రైవ్‌ చేసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా మామయ్య, ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తరచూ గుర్తు చేసేవారు’ అని చెప్పుకొచ్చాడు సాయి దుర్గ తేజ్.

యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు సాయి దుర్గ తేజ్. ఈ సినిమా ఏకంగా వంద కోట్ల కు పైగా కలెక్షన్లను రాబట్టింది.  ఆ తర్వాత తన మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాలో  యాక్ట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌ ట్రాఫిక్‌, రోడ్‌ సేఫ్టీ సమ్మిట్‌ 2025 లో సాయి దుర్గ తేజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బోడో సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. వీడియో
బోడో సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. వీడియో
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ