Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్.. టాప్‌లోకి సుమన్ శెట్టి.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో రెండో వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్దమైంది. ఈ వారం మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా ఇప్పటికే ఆన్ లైన్ ఓటింగ్ కూడా షురూ అయ్యింది. అయితే బుధవారం (సెప్టెంబర్ 17) రాత్రి 9.00 PM నాటికి ఓటింగ్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో రెండో వారానికి చేరుకుంది. మొదటి వారంలో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచ బయటకు వచ్చింది. ప్రస్తుతం హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక రెండో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి మొత్తం 7 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. మాస్క్ మ్యాన్ హరిత హరీష్, భరణి శంకర్, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, డీమాన్ పవన్ నామినేషన్‌లో నిలిచిన వారిలో ఉన్నారు. రెండో వారం నామినేషన్ల ప్రక్రియ ముగియగానే.. ఆన్ లైన్ లో ఓటింగ్ లైన్స్ కూడా ప్రారంభమయ్యాయి. తమ కంటెస్టెంట్లను ఎలిమినేషన్ నుంచి కాపాడుకునేందుకు ఆడియెన్స్, వ్యూవర్స్, ఫ్యాన్స్ భారీగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈ వారంలో టాప్ సెలబ్రిటీలు నామినేషన్స్ లో ఉండడంతో భారీగా ఓట్లు పోలవుతున్నాయి. ఇక బుధవారం రాత్రి 9 గంటల నాటికి ఓటింగ్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి.
గత వారం లాగే ఈ వీక్ లోనూ ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోతున్నాడు సుమన్ శెట్టి. ఇప్పటివరకు ఈ కమెడియన్ కు 41 శాతం ఓట్లు పడ్డాయి. రెండో ప్లేసులో సీరియల్ నటుడు భరణి కొనసాగుతున్నాడు. ఇతనికి 26 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక మూడో ప్లేసులో మాస్క్ మ్యాన్ హరీశ్ ( 8శాతం), నాలుగో స్థానంలో డీమాన్ పవన్ (7.5 శాతం ఓట్లు), ఫ్లోరా శైనీ (6 శాతం) ఐదో స్థానంలో, ప్రియా శెట్టి ( 5 శాతం) ఆరో ప్లేసులో, మనీశ్ మర్యాద( 3 శాతం) ఏడో ప్లేసులో కొనసాగుతున్నారు. అంటే ప్రస్తుతం ప్రియా శెట్టి, మనీశ్ డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. అలాగే గత వారం ఎలిమినేషన్ నుంచి త్రుటిలో తప్పించుకున్న ఫ్లోరా శెట్టికి కూడా తక్కువగా ఓట్లు పడుతున్నాయి. కాబట్టి ఆమె కూడా డేంజర్ జోన్ లోనే ఉందని భావించవచ్చు. అయితే ఓటింగ్ కు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఒక వేళ ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే మాత్రం మర్యాద మనీశ్ బయటకు వెళ్లే అవకాశముంది.
బిగ్ బాస్ ఆన్ లైన్ ఓటింగ్ సరళి ఇలా..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








