AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మహిళల్ని హతమార్చి దిష్టి బొమ్మలుగా.. నరబలుల నేపథ్యంలో కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్

క్షుద్ర పూజలు, నర బలులు, సీరియల్ కిల్లింగ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే ట్విస్టులు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

OTT Movie: మహిళల్ని హతమార్చి దిష్టి బొమ్మలుగా.. నరబలుల నేపథ్యంలో కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 16, 2025 | 8:43 PM

Share

సినిమాల్లో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ ఒక్కోసారి థియేటర్లలో ఆడవు. ప్రమోషన్లు పెద్దగా లేకపోవడం, పేరున్న నటీనటులు ఉండకపోవడం, బరిలో ఇతర సినిమాలు ఉండడం.. ఇలా థియేటర్లలో సినిమాలు ఆడకపోవడానికి చాలా కారణాలుంటాయి. అయితే ఇదే సినిమాలు ఓటీటీలోకి వస్తే ఓ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంటాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో మాత్రం దుమ్ముదులుపుతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కర్ణాట‌క‌ , ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతంలో వ‌రుస‌గా అమ్మాయిలు హ‌త్య‌ల‌కు గురువుతుంటారు. మ‌హిళ‌ల్ని అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేస్తోన్న సైకో వారి త‌ల‌ల స్థానంలో దిష్టి బొమ్మ‌ల‌ను పెడుతుంటాడు. దీంతో ఈ హత్యలు రెండు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్ఠిస్తాయి. 17 మంది అమ్మాయిలు హత్యకు గురైనా పోలీసులు ఒక్క క్లూ కూడా సంపాదించ‌లేక‌పోతారు.

చివరకు ఈ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి స్థానికంగా పేరున్న ఓ డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. ఈ సీరియల్ మర్డర్స్ వెనుక క్రాస్-స్టేట్ కనెక్షన్ ఉందని విచారణలో తెలుసుకుంటాడు. అంతేకాదు క్షుద్ర పూజలు, నరబలుల నేపథ్యం కూడా ఉందని వెలుగులోకి వస్తుంది. ఎవరి ఊహలకు అందని కొన్ని సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి.  మరి అమ్మాయిల వరుస హత్యలకు కారణమెవ్వరు? ఆ సీరియల్ సైకో కిల్లర్ ఉద్దేశమేంటి? అమ్మాయిల తలలను ఎందుకు నరుకుతున్నాడు. వాటి స్థానంలో దిష్ట బొమ్మలను ఎందుకు తగిలిస్తున్నాడు? క్షుద్ర పూజలు, నరబలులతో వీటికి ఏమైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం ఎవరి ఊహలు, అంచనాలకు అందకుండా ఎంతో థ్రిల్లింగ్ గా సాగుతాయి.

ఈ సినిమా పేరు భూతద్దం భాస్కర్ నారాయణ. పురుషోత్తం రాజ్ తెరకక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో యంగ్ హీరో, హీరోయిన్లు  శివ కందుకూరి, రాశి సింగ్ అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీల్లో నూ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ ఫామ్స్ లలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..