AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garikipati Narasimha Rao: ‘నేను ఈ సినిమా చూశా .. మీరూ చూడండి.. నిజమైన ప్రేమేంటో తెలుస్తుంది’: గరికపాటి

తన అవధానాలు, సందేశాల్లో సందర్భానుసారంగా సినిమాలను ప్రస్తావించడం తప్పితే ప్రత్యేకంగా ఒక సినిమా గురించి గరికపాటి నరసింహారావు మాట్లాడడం చాలా అరుదు. అలాంటి ఆయన తాజాగా ఒక తెలుగు సినిమాను చూసి అనంతరం ఆ మూవీని ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Garikipati Narasimha Rao: 'నేను ఈ సినిమా చూశా .. మీరూ చూడండి.. నిజమైన ప్రేమేంటో తెలుస్తుంది': గరికపాటి
Garikipati Narasimha Rao
Basha Shek
|

Updated on: Sep 16, 2025 | 8:13 PM

Share

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ట్రెండ్ కు తగ్గట్టుగా మాట్లాడడం, ఏ విషయంపైనైనా కుండ బొద్దలు కొట్టినట్లు వివరించడం గరికపాటి స్టైల్. అందుకే ఆయన అవధానాలు, సందేశాలను యువత కూడా బాగా ఇష్టపడతారు. సోషల్ మీడియాలోనూ గరికపాటి వీడియోలు బాగా వైరలవుతుంటాయి. ఇక తన సందేశాల్లో సందర్భానుసారంగా సినిమాలను ప్రస్తావించడం తప్పితే ప్రత్యేకంగా ఒక సినిమా గురించి గరికపాటి మాట్లాడడం చాలా అరుదు. అలాంటి ఆయన తాజాగా ఒక తెలుగు సినిమాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజమైన ప్రేమ ఏంటో తెలియాలంటే ఈ తెలుగు సినిమాను చూడాలని అందరికీ సూచించారు. తానూ ఈ సినిమా చూశానని యువత కూడా ఈ సినిమాను చూడాలని గరికపాటి కోరారు. ఇంతకీ గరికపాటి మనసును హత్తుకున్న ఆ సినిమా ఏంటో తెలుసా? అనంతిక సానీల్‌ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 8 వసంతాలు. ఇటీవలే ఈ సినిమా థియేటర్లలో విడుదల కాగా ఓ మోస్తరుగా ఆడింది. తాజాగా ఈ ప్రేమకథను ఉద్దేశించే గరికపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

‘ఇటీవల విడుదలైన 8 వసంతాలు సినిమా చూస్తే చాలు నిజమైన ప్రేమ ఏంటో తెలుస్తుంది. నేను ఈ సినిమా చూశాను. శారీరక సౌఖ్యాలు.. ఒకరి గురించి మరొకరు గొప్పలు చెప్పుకోవడం కాదు ప్రేమంటే.. నిజమైన ప్రేమ అనేది మనసులో ఉంటుంది.. కలిసి ఉన్నా, విడిపోయినా వారు సుఖంగా ఉండాలని కోరుకుంటారు’ అని చెప్పుకొచ్చారు గరికపాటి. ఇందుకు సంబంధించిన వీడియోను 8 వసంతాలు సినిమా ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

గరికపాటి నరసింహారావు వీడియో..

ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో..

ఫణీంద్ర నర్సెట్టి 8 వసంతాలు సినిమాలో అనంతిక తో పాటు హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఏడాది జూన్‌ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మోస్తరుగా ఆడింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..