AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laundry Hacks: వాషింగ్ మెషీన్‌లో షూస్ వేస్తున్నారా?.. ఈ విషయాలు తెలియకుంటే మీ మెషిన్ పాడవడం ఖాయం!

ప్రతి ఒక్కరికీ రకరకాల షూస్ ఉండటం కామన్ అయిపోయింది. అయితే, వాటన్నింటినీ ఎప్పటికప్పుడు చేతితో క్లీన్ చేయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. సమయాన్ని ఆదా చేసేందుకు చాలామంది షూస్‌ను నేరుగా వాషింగ్ మెషీన్‌లో వేసేస్తుంటారు. కానీ ఇది మీ ఖరీదైన షూస్‌కు మరణశాసనం కావచ్చని మీకు తెలుసా? మీ బూట్లు, వాషింగ్ మెషీన్ రెండూ సురక్షితంగా ఉండాలంటే పాటించాల్సిన ఆ స్మార్ట్ క్లీనింగ్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Laundry Hacks: వాషింగ్ మెషీన్‌లో షూస్ వేస్తున్నారా?.. ఈ విషయాలు తెలియకుంటే మీ మెషిన్ పాడవడం ఖాయం!
How To Wash Shoes In Washing Machine
Bhavani
|

Updated on: Mar 14, 2026 | 9:02 PM

Share

వాషింగ్ మెషీన్‌లో బూట్లు ఉతకవచ్చా? అంటే.. కొన్ని రకాల షూస్ కు మాత్రమే అవును అని సమాధానం చెప్పాలి. కాన్వాస్, స్పోర్ట్స్ షూస్ వంటివి మెషీన్ లో ఉతికినా.. లెదర్ లేదా సిల్క్ షూస్ వేస్తే అవి శాశ్వతంగా పాడయ్యే అవకాశం ఉంది. వేడి నీటి ప్రభావం నుండి, డ్రైయర్ వల్ల కలిగే నష్టాల వరకు.. మీ బూట్లు కొత్తవాటిలా మెరవాలంటే లిక్విడ్ డిటర్జెంట్ ను ఎలా వాడాలి? షూస్ కోసం ప్రత్యేక లాండ్రీ బ్యాగ్స్ ఎందుకు అవసరం? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

1. ఏ షూస్ ఉతకాలి? ఏవి వద్దు?

అన్ని బూట్లు మెషీన్ వాష్ కు పనికిరావు. కాన్వాస్, సింథటిక్ మరియు స్పోర్ట్స్ షూస్ ను ఉతకవచ్చు. కానీ తోలు, స్వెడ్ లేదా సిల్క్ తో చేసిన షూస్ ను పొరపాటున కూడా మెషీన్ లో వేయకండి. దీనివల్ల వాటి రంగు మెటీరియల్ దెబ్బతింటుంది.

2. లేస్‌లు మరియు ఇన్సోల్స్ తొలగించండి:

ఉతికే ముందు షూస్ కి ఉండే లేస్‌లను విడిగా తీసేయండి. అలాగే షూ లోపల ఉండే అరికాళ్లను వీలైనంత వరకు చేతితో కడగడమే మంచిది. బూట్లపై ఉన్న దుమ్మును ముందుగా ఒక పొడి బ్రష్ తో దులపడం మర్చిపోవద్దు.

3. ‘పిల్లో కవర్’ హ్యాక్ :

షూస్ మెషీన్ లో గట్టిగా తగిలి శబ్దం రాకుండా మరియు మెషీన్ లోపలి భాగం పాడవకుండా ఉండాలంటే.. షూస్ ను ఒక లాండ్రీ బ్యాగ్ లో లేదా పాత దిండు కవర్ లో ఉంచి ఉతకండి. ఇది షూస్ కు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

4. లిక్విడ్ డిటర్జెంట్ మాత్రమే వాడండి:

పౌడర్ డిటర్జెంట్లు షూస్ మూలల్లో ఇరుక్కుపోయి తెల్లటి మరకలను వదిలివేస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ మైల్డ్ లిక్విడ్ డిటర్జెంట్ ను మాత్రమే ఉపయోగించండి.

5. వేడి నీరు వద్దు.. చల్లటి నీరే ముద్దు!

షూస్ ఉతకడానికి ఎప్పుడూ వేడి నీటిని వాడకూడదు. వేడి వల్ల షూ అరికాళ్లకు ఉండే గమ్ (Glue) కరిగిపోయి, అవి విడిపోయే ప్రమాదం ఉంది. మెషీన్ ను ఎల్లప్పుడూ జెంటల్/డెలికేట్ మోడ్ లో ఉంచండి.

6. డ్రైయర్ జోలికి వెళ్లకండి:

వాషింగ్ మెషీన్ లోని టంబుల్ డ్రైయర్ షూస్ ఆకారాన్ని పూర్తిగా పాడు చేస్తుంది. బూట్లలోని నీటిని కదిలించి తీసేసిన తర్వాత, వాటిని సహజంగా ఎండలో లేదా గాలికి ఆరబెట్టడం అత్యంత సురక్షితమైన పద్ధతి.

7. మెషీన్ భద్రత:

షూస్ తో పాటు కొన్ని పాత టవల్స్ ను మెషీన్ లో వేయడం వల్ల.. మెషీన్ డ్రమ్ కు షూస్ బలంగా తగలకుండా ఉంటాయి. దీనివల్ల మెషీన్ లైఫ్ కూడా పెరుగుతుంది.

చిన్న చిట్కా: తెల్లటి షూస్ మరీ మురికిగా ఉంటే, ఉతికే ముందు కొద్దిగా బేకింగ్ సోడా అప్లై చేస్తే అవి ముత్యాల్లా మెరుస్తాయి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ షూస్ పైన ఉన్న ‘వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్’ లేబుల్ ను చదివిన తర్వాతే మెషీన్ లో వేయండి.

Follow Us