AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 రోజుల పాటు ఈ తెల్లని విషం తినకపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? చర్మం మెరవాలని కోరుకుంటున్నారా? అయితే ఈ 14 డేస్ నో మైదా ఛాలెంజ్ స్వీకరించండి.. మైదాను కేవలం రెండు వారాల పాటు దూరం పెడితే మీ జీర్ణక్రియ వేగం పుంజుకోవడమే కాకుండా మీ శక్తి స్థాయిలు అనూహ్యంగా పెరుగుతాయి. అసలు మైదా మానేయడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే..?

14 రోజుల పాటు ఈ తెల్లని విషం తినకపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
14 Days No Maida Challenge
Krishna S
|

Updated on: Apr 04, 2026 | 9:39 PM

Share

బ్రెడ్, బిస్కెట్లు, నూడుల్స్, పరోటాలు.. ఇలా మనకు ఇష్టమైన చాలా పదార్థాల్లో మైదా ప్రధాన భాగం. రుచికి బాగున్నా, ఆరోగ్యానికి ఇది ఒక తెల్ల విషం లాంటిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మీరు కేవలం రెండు వారాల పాటు మైదాను పూర్తిగా పక్కన పెడితే మీ శరీరంలో జరిగే శాస్త్రీయ మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మైదాను శుద్ధి చేసే ప్రక్రియలో అందులోని పీచు పదార్థం పూర్తిగా నశిస్తుంది. ఇది పేగులకు జిగురులా అంటుకునే స్వభావం కలిగి ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. మీరు మైదా మానేసిన 14 రోజుల్లోనే మీ జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు తేలికగా మారడాన్ని గమనించవచ్చు.

స్థిరమైన శక్తి – ఇన్సులిన్ నియంత్రణ

మైదా తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి, అంతే వేగంగా పడిపోతాయి. దీనివల్ల మీరు త్వరగా అలసిపోతారు. మైదాకు దూరంగా ఉంటే రక్తంలో ఇన్సులిన్ స్థిరంగా ఉంటుంది. ఫలితంగా రోజంతా నీరసం లేకుండా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండగలుగుతారు.

మెరిసే చర్మం – మొటిమల నివారణ

మైదా ఒక రిఫైన్డ్ కార్బోహైడ్రేట్. ఇది శరీరంలో వాపు కలిగించి, ముఖంపై మొటిమలు, చర్మపు చికాకుకు దారితీస్తుంది. కేవలం రెండు వారాలు దీనిని మానేస్తే మీ చర్మం మరింత కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది.

వేగంగా బరువు తగ్గడం

మైదా వంటకాల్లో కేలరీలు చాలా ఎక్కువ. ఇవి శరీరంలో కొవ్వుగా మారి పొట్ట భాగంలో పేరుకుపోతాయి. మైదాను వదిలేయడం వల్ల శరీరానికి అనవసరపు కేలరీలు అందవు, ఇది బరువు తగ్గడానికి మరియు బాడీ షేప్‌ను కాపాడుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. కాగా మైదాకు బదులుగా తృణధాన్యాలు, రాగులు, జొన్నలు లేదా గోధుమ పిండిని వాడటం ఉత్తమం. 14 రోజుల ఈ నో మైదా ఛాలెంజ్ మీ జీవనశైలిలోనే గొప్ప మార్పును తెస్తుంది.

Follow Us