AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు.. కట్ చేస్తే 19 ఏళ్ల పనిమనిషిని రేప్ చేసి జైలుకెళ్లిన హీరో.. దెబ్బకు కెరీర్ ఖతం

ఆర్మీ నేపథ్యమున్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఇంజనీరింగ్ లాంటి ఉన్నద విద్యను అభ్యసించాడు. మోడల్ గా ఎన్నో ప్రకటనల్లో మెరిశాడు. ఆ తర్వాత సినిమాల్లోనూ సక్సెస్ అయ్యాడు.. కానీ.. ఒకే ఒక్క ఘటన ఈ స్టార్ హీరో జీవితాన్ని తలకిందులు చేసింది.

ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు.. కట్ చేస్తే 19 ఏళ్ల పనిమనిషిని రేప్ చేసి జైలుకెళ్లిన హీరో.. దెబ్బకు కెరీర్ ఖతం
Bollywood Actor
Basha Shek
|

Updated on: Sep 11, 2025 | 6:40 AM

Share

విపరీతమైన పోటీ ఉన్న సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంత సాధ్యం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఇక్కడ సినిమా అవకాశాలు రావు. నటుడిగా గుర్తింపు దక్కదు.  అలాంటిది ఇంజనీరింగ్ చదివిన ఈ హీరో ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మోడలింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాడు. పలు ఉత్పత్తుల ప్రకటనల్లో నటించాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. హీరోగా నిలదొక్కుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు. స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. చూడ్డానికి మిల్క్ బాయ్ లా కనిపించే ఈ హీరోకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఇలా ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ హీరో ఒకే ఒక ఘటనతో బ్యాడ్ బాయ్ గా మారిపోయాడు. తన ఇంట్లో పనిచేసే 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో కోర్టు ఈ హీరోకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే భార్య చేసిన పోరాటంతో బెయిల్ పై బయటకు వచ్చాడు. కానీ అతనికి ఎవ్వరూ సినిమా అవకాశాలు లేదు. ఫలితంగా సినిమా ఇండస్ట్రీ నుంచే అదృశ్యమయ్యాడు. అతను మరెవరో కాదు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షైనీ అహుజా.

ఈ పేరు వింటే తెలుగు ఆడియెన్స్ కు ఠక్కున గుర్తు కు రాకపోవచ్చు. కానీ హిందీ సినిమాలు చూసే వారికి ఈ హ్యాండ్సమ్ హీరో బాగా పరిచయం. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ, కంగనా రనౌత్ నటించిన గ్యాంగ్ స్టర్ సినిమాలో ‘యా అలీ’ సాంగ్ అంటే ఈ హీరోనే మనసులో మెదులుతాడు.  గ్యాంగ్ స్టర్ తో పాటు భూల్ భులయ్యా, ఓ లమ్హే, లైఫ్ ఇన్ ఎ మెట్రో, హజారో ఖోవాహిషే ఐసి,  ఖోయా ఖోయా చంద్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించాడు షైనీ అహుజా. కానీ 2009లో 19 ఏళ్ల పనిమనిషిపై అత్యాచారం చేసినట్లు ఈ హీరోపై సంచలన ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ పనిమనిషి కోర్టులో తన వాంగ్మూలాన్ని మార్చుకుని అత్యాచారాన్ని ఖండించింది. కానీ  ఒత్తిడి లేదా భయం కారణంగా బాధితురాలు ఇలా చెప్పి ఉండవచ్చని కోర్టు భావించింది. దీంతో కోర్టు షైనీని దోషిగా నిర్ధారిం ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీని తర్వాత కొన్నేళ్లకు అతను బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే అప్పటికే అతనికి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కరువైపోయాయి. ప్రస్తుతం ఈ నటుడు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియదు.

ఇవి కూడా చదవండి
Shiney Ahuja

Shiney Ahuja

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.