Kumari Aunty: వేలంలో గణేశుడి లడ్డు గెల్చుకున్న కుమారీ ఆంటీ.. ఎంతకో తెలుసా? వీడియో వైరల్
ఆ మధ్యన జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి ప్రముఖ టీవీ షోల్లో సందడి చేసింది కుమారీ ఆంటీ . బిగ్ బాస్ షోలోనూ పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే అవి రూమర్లు గానే మిగిలిపోయాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం కుమారీ ఆంటీ క్రేజ్ అస్సలు తగ్గడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సంబరాలు ముగిశాయి. గణేశ్ చతుర్ధిని ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారో నిమజ్జనోత్సవాన్ని కూడా అంతే అట్టహాసంగా నిర్వహించారు. ఇక గణేష్ నిమజ్జనోత్సవంలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం లడ్డూ వేలం. ఎంత మొత్తాన్నైనా ఇచ్చేసి గణేశుడి లడ్డూను దక్కించుకోవాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వినాయకుడి లడ్డూ కోసం పోటీ పడిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా సెన్సేషన్ కుమారీ ఆంటీ కూడా వేలంలో లడ్డూ దక్కించుకుంది. మా నగర్ గణేష్ నిమజ్జనోత్సవంలో భాగంగా జరిగిన లడ్డూ వేలంలో కుమారి ఆంటీ కూడా పాల్గొంది. అందరితో పోటీపడి మరీ లడ్డూను గెలుచుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ సందర్భంగా గణేశుడి లడ్డూకు ప్రత్యేక పూజలు చేసిన ఆమె ఒక వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. అందులో ఇలా చెప్పుకొచ్చింది.. ‘హలో.. అండి అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కుమారి ఆంటీని. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. నిజంగా గణేశుడు నాకింత ఆశీర్వాదం ఇచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. వినాయకుల వారి లడ్డూను నేను దక్కించుకున్నాను. చాలా ఏళ్ల నుంచి నేను ఇది కోరుకుంటున్నాను. వేలంలో గణేశుడి లడ్డూ దక్కించుకుని, ఇంటికి తెచ్చుకుని, అందరికీ పంచాలని చాలా ఏళ్ల నుంచి అనుకుంటున్నాను. ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. నేను హోటల్ పెట్టి సుమారు 15 సంవత్సరాలు అయ్యింది. ఈ 15 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది వినాయకుడి ప్రసాదం ఇస్తూనే ఉన్నాను. ఇలా ఇప్పటివరకు ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు. అదే సమయంలో నీ లడ్డూ ఎప్పుడిస్తావు నాయనా? అని గణేశుడిని వేడుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు 15 సంవత్సరాలకు నా కల నెరవేరింది. స్వామి వారికి నేను ప్రసాదం ఇవ్వడమే కాదు ఇప్పుడు నాకు ఆ అదృష్టాన్ని కల్పించారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. జై గణేశా.. జై జై గణేశా ‘ అంటూ ముగించింది కుమారీ ఆంటీ.
వేలంలో దక్కించుకున్న గణేశుడి లడ్డూతో కుమారీ ఆంటీ.. వీడియో..
View this post on Instagram
అయితే ఎంత మొత్తానికి ఈ లడ్డూ దక్కించుకుందో కుమారీ ఆంటీ ఈ వీడియోలో చెప్పలేదు. ప్రస్తుతం ఈ వీడియో అయితే సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .








