Allu Arjun: ‘నా డియరెస్ట్ ఫ్రెండ్‌కు ఆల్ ది బెస్ట్’.. ఆమెకు స్పెషల్ విషెస్ చెప్పిన అల్లు అర్జున్
పుష్ప 2తో పాన్ ఇండియా రేంజ్ లో మరింత ఫేమస్ అయిపోయాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీని తర్వాత ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో 'గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ' తరహాలో ఓ పాన్ వరల్డ్ మూవీ లో నటిస్తున్నాడు.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అతని నాయనమ్మ అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారు. దీంతో అల్లు ఫ్యామిలీతో పాటు మెగా కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటీవల ఆమెకు దశ దినకర్మ కూడా నిర్వహించి అల్లు కనకరత్నమ్మను గుర్తు తెచ్చుకున్నారు. ఇక పుష్ప 2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో ఓ పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ. 700 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తైంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే బన్నీతాజాగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. అదేంటంటే..
మంచు లక్ష్మీ సుమారు ఐదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. ఆమె నటించిన తాజా చిత్రం దక్ష. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఈ మూవీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారే మేకర్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా దక్ష థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దక్ష ట్రైలర్ పై ప్రశంసలుకు కురిపించిన బన్నీ మంచు లక్ష్మీతో పాటు దక్ష చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అల్లు అర్జున్. ‘నా మిత్రురాలు మంచు లక్ష్మీ ప్రసన్నకు నా శుభాకాంక్షలు. మీరు, మోహన్ బాబు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశాడు బన్నీ.
Best wishes to my dearest friend @LakshmiManchu on her upcoming film #Daksha. Lots of Love & Warm hug. It’s wonderful to see you and @themohanbabu garu together on screen.#DakshaTrailer – https://t.co/PSsbRCP2FF
Wishing the film immense success. Best wishes to director…
— Allu Arjun (@alluarjun) September 9, 2025
ప్రస్తుతం అల్లు అర్జున్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








