AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 40 ఏళ్ల వయసులో ఐవీఎఫ్.. అనుకోని విషాదంతో ‘తల్లి’డిల్లిపోతోన్న ప్రముఖ నటి

40 ఏళ్ల వయసులోనూ సింగిల్ గా ఉన్న ఈ ప్రముఖ నటి ఎలాగైనా అమ్మ కావాలనుకుంది. అందుకోసం ఐవీఎఫ్ (కృత్రిమ గర్భధారణ పద్ధతి)ని ఎంచుకుంది. కొన్ని రోజుల క్రితమే గర్భం కూడా దాల్చడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.. కానీ అంతలోనే..

Tollywood: 40 ఏళ్ల వయసులో ఐవీఎఫ్.. అనుకోని విషాదంతో 'తల్లి'డిల్లిపోతోన్న ప్రముఖ నటి
Bhavana Ramanna
Basha Shek
|

Updated on: Sep 08, 2025 | 9:33 PM

Share

ప్రముఖ కన్నడ నటి, నృత్యకారిణి భావన రామన్న పేరు ఇటీవల తరచూ వార్తల్లో వినిపిస్తోంది. 40 ఏళ్ల వయసులోనూ ఒంటరిగానే ఉన్న ఆమె ఇటీవల గర్భం దాల్చడంతో నటి పేరు నెట్టింట బాగా మార్మోగిపోయింది. పెళ్లి చేసుకోకపోయినా అమ్మ అని పిలుపించుకోవాలన్న ఆశతో కృత్రిమ గర్భధారణ పద్ధతి ఐవీఎఫ్ ను ఆశ్రయించింది భావన. ఆమె కోరుకున్నట్లే గర్భం దాల్చడంతో నటి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయింది? ఇక కుటుంబ సభ్యులు ఆమెకు ఘనంగా సీమంతం కూడా చేశారు. ఆ ఫొటోలను కూడా షేర్ చేయగా నెట్టింట వైరలయ్యాయి. వీటిపై కొందరి నుంచి తీవ్ర వ్యతిరేకత రాగా నటి మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగింది. ఈ క్రమంలో బిడ్డను ఎప్పుడు కందామా? అమ్మా అని ఎప్పుడు పిలిపించుకుందామా? అని కలలు కంటోన్న భావన జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ అందులో ఒకరు కన్నుమూశారు. ఇద్దరు అడ పిల్లలు జన్మించగా ఒక శిశువు శనివారం (సెప్టెంబర్ 06) అస్వస్థతతో మృతి చెందినట్లు తెలిసింది. మరో శిశువు అరోగ్యవంతురాలిగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

గర్భం దాల్చిన ఏడవ నెలలోనే ప్రసవించింది భావన రామన్న. అంతకు ముందే కవలలలో ఒకరికి సమస్యలు ఉన్నట్లు స్కాన్‌లో తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఎనిమిదవ నెలలో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. అందులో ఇద్దరు పిల్లలు పుట్టగా ఒకరు చనిపోయారు. మరొక శివవు ఆరోగ్యంగా ఉంది. భావన కూడా ఆరోగ్యంగా ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

నటి భావన సీమంతం వేడుక.. వీడియో..

బేబీ బంప్ తో నటి భావన రామన్న..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి