AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vani Viswanath: అందాల తార వాణీ విశ్వనాథ్ గుర్తుందా? ఆమె కూతురు కూడా తెలుగులో క్రేజీ హీరోయిన్ .. ఎవరో తెలుసా?

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది వాణి విశ్వనాథ్‌. తెలుగు, మలయాళంలో దాదాపు అందరు టాప్‌ హీరోలతో నటించి మెప్పించిందీ అందాల తార. అయితే చాలా మందికి తెలియని విషయమేమిటంటే ఆమె కూతురు కూడా టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోంది.

Vani Viswanath: అందాల తార వాణీ విశ్వనాథ్ గుర్తుందా? ఆమె కూతురు కూడా తెలుగులో క్రేజీ హీరోయిన్ .. ఎవరో తెలుసా?
Vani Viswanath Daughter
Basha Shek
|

Updated on: Sep 07, 2025 | 9:39 AM

Share

సీనియర్‌ నటి వాణి విశ్వనాథ్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరుకు మలయాళ నటినే అయినా తెలుగులోనూ ఎక్కువగా సినిమాలు చేసింది. ధర్మతేజ, సింహ స్వప్నం, సాహసమే నా ఊపిరి, కొదమ సింహం, మామా అల్లుడు, పరిష్కారం, సర్పయాగం, ఘరానా మొగుడు, సామ్రాట్‌ అశోక, గ్యాంగ్‌ మాస్టర్‌ తదితర సూపర్ హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిందీ అందాల తార. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని రాజకీయాల్లోనూ యాక్టివ్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని ఓ ప్రముఖ పార్టీలో చేరిన ఆమె అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావించారు. అయితే ఎందుకోగానీ మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవువుతోందీ అందాల తార. జయ జానకి నాయక సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది వాణీ విశ్వనాత్. రాజ్ తరుణ్ ఓరేజ్ బుజ్జిగా సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిచింది. సినిమాల సంగతి పక్కన పెడితే వాణి విశ్వనాథ్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. వాణి విశ్వనాథ్‌.. మలయాళ ప్రముఖ నటుడు, దర్శకుడు బాలు రాజ్‌ని పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం. 2002లో వీరి పెళ్లి జరగ్గా నలుగురు పిల్లలున్నారు.

అయితే వాణీ విశ్వనాథ్ కూతురు ఇప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తోంది. ఇప్పటికే ఆమె ఓవరాల్ గా మూడు సినిమాల్లో నటించింది. త్వరలోనే ఆమె నటించిన నాలుగో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? వర్షా విశ్వనాథ్. వాణీ విశ్వనాథ్ చెల్లెలు ప్రియా విశ్వనాథ్ కుమార్తెనే ఈ అందాల తార. 2022లో ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వర్షా విశ్వనాథ్. అయితే ఈ మూవీ పెద్దగా ఆడలేదు. దీని తర్వాత మలయాళంలో పాథోన్పథం నూట్టండు అనే ఓ సినిమాలోనూ నటించింది. ఈ మూవీ అక్కడ బాగా ఆడింది.

ఇవి కూడా చదవండి

వర్షా విశ్వనాథ్ లేటెస్ట్ ఫొటోస్..

ప్రస్తుతం మటన్ సూప్ అనే తెలుగు సినిమాలో నటిస్తోంది వర్షా విశ్వనాథ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'సిగ్మా'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
'సిగ్మా'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన
సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..
సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..
థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!
థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!
బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?
బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?