AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 46 ఏళ్ల వయసులో తండ్రికానున్న స్టార్ కమెడియన్.. భార్య సీమంతం ఫొటోస్ వైరల్

ఓ స్టార్ డైరెక్టర్ సోదరుడైన ఇతను మల్టీపుల్ ట్యాలెంటెడ్. కేవలం నటుడిగానే కాకుండా సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాలు ఆలపించాడు. గతేడాదే పెళ్లి చేసుకున్న ఈ నటుడు ఇప్పుడు శుభవార్త చెప్పాడు.

Tollywood: 46 ఏళ్ల వయసులో తండ్రికానున్న స్టార్ కమెడియన్.. భార్య సీమంతం ఫొటోస్ వైరల్
Premgi Amaren Family
Basha Shek
|

Updated on: Sep 05, 2025 | 7:49 PM

Share

చాలా మంది పెళ్లి విషయంలో చాలా ఆలస్యం చేస్తుంటారు. ప్రొఫెషనల్ లైఫ్ లో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుందామని ఆలోచిస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో అయితే మరీనూ. సల్మాన్ ఖాన్ లాంటి నటులు 50 దాటినా అసలు పెళ్లి ఊసేత్తడం లేదు. ఇంకొందరు లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ కమెడియన్ ప్రేమ్ జీ కూడా చాలా లేటు వయసులో పెళ్లిపీటలెక్కాడు. 45 ఏళ్ల వయసులో ఇందు అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గతేడాదే వీరి వివాహం సింపుల్ గా జరిగింది. ఇప్పుడీ స్టార్ కమెడియన్ శుభవార్త చెప్పాడు. తాము తల్లిదండ్రులం కానున్నట్లు వెల్లడించాడు. తాజాగా ప్రేమ్ జీ భార్య ఇందు సీమంతం అట్టహాసంగా జరిగింది. ఇరు కుటంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు ఈ సీమంతం వేడుకకు హాజరయ్యారు. ప్రేమ్ జీ దంపతులను మనసారా ఆశీర్వదించి అభినందించారు. ప్రస్తుతం ప్రేమ్ జీ భార్య ఇందు సీమంతం ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ప్రేమ్ జీ- ఇందు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రేమ్‏జీ విషయానికొస్తే.. ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు గంగై అమరన్ కుమారుడు. అలాగే ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభుకు స్వయానా సోదరుడు. సింగర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రేమ్ జీ యువన్ శంకర్ రాజా సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాడు. ఆతర్వాత ప్లే బ్యాక్ సింగర్ గా ర్యాప్ సాంగ్స్ తో అదరగొట్టాడు. పవన్ కల్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాలోని చిట్టి నడుమునే చూస్తున్నా సాంగ్ ప్రేమ్ జీ పాడిందే. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడిన ప్రేమ్ జీ 2006లో వల్లవన్ మూవీతో నటుడిగా మారాడు. ఆ తర్వాత గ్ల్యాంబ్లర్, సింబా, మన్మథ లీల, మానాడు, తమిళ్ రాకర్స్, ప్రిన్స్, కస్టడీ, ది గోట్, దినసరి, వళిమై సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

భార్య సీమంతం వేడుకలో నటుడు ప్రేమ్ జీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.