- Telugu News Photo Gallery Cinema photos Actress aparna balamurali latest beautiful photos goes viral
Aparna Balamurali: ఎంత క్యూట్‌గా ఉందో.. అదరగొట్టిన అందాల భామ అపర్ణ బాలమురళి
ఈ మధ్యకాలంలో హీరోయిన్ సినిమాల్లో గ్లామర్ షోలకంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎం ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండటంతో హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తమ నటనతో మెప్పిస్తున్నారు.
Updated on: Sep 05, 2025 | 8:32 PM

ఈ మధ్యకాలంలో హీరోయిన్ సినిమాల్లో గ్లామర్ షోలకంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎం ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండటంతో హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తమ నటనతో మెప్పిస్తున్నారు.

హీరోలకు సమానంగా పాత్రలను ఎంచుకుంటూ మెప్పిస్తున్నారు. మొన్నామధ్య 2025 సంవత్సరానికి 30 ఏళ్లలోపు 30 మంది ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. లిస్ట్ లో స్టార్ హీరోయిన్స్ అందరిని ఓ యంగ్ బ్యూటీ వెనక్కి నెట్టేసింది. ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న భామ ఎవరో కాదు అపర్ణ బాలమురళి.

గత ఏడాది అపర్ణ బాలమురళి ధనుష్ దర్శకత్వం వహించిన నటించిన రాయన్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే మలయాళంలో కిష్కింధ కాండం, రుద్రం సినిమాల్లోనూ నటించింది.

ఈ అమ్మడు 2020లో సుధా కొంగర దర్శకత్వంలో విడుదలైన ‘ఆకాశమే నీ హద్దు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో సూర్య హీరోగా నటించగా ఆయనకు జంటగా నటించారు. ఈ సినిమాలో అద్భుతంగా నటించింది అపర్ణ.

ఈ చిత్రంలో నటనకు గాను ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా లభించింది. ఇక ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన క్యూట్ ఫోటోలతో ప్రేక్షకులను కవ్విస్తుంది.




