- Telugu News Photo Gallery Cinema photos Collie Movie Fame Actor Soubin Shahir Celebrates Onam With Family, See Photos
Soubin Shahir: సౌబిన్ షాహిర్ ఇంట్లో ఓనమ్ సెలబ్రేషన్స్..’కూలీ’ సినిమా నటుడి ఫ్యామిలీని చూశారా? ఫొటోస్ వైరల్
ఇటీవల రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ఓ కీలక పాత్ర పోషించాడు. సినిమాలో రజనీ, నాగార్జునలు ఉన్నా కథ మొత్తం ఈ నటుడి చుట్టే తిరుగుతుంది. ఇక మోనికా సాంగ్ లో ఈ మలయాళ నటుడి డ్యాన్స్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది.
Updated on: Sep 05, 2025 | 6:16 PM

కేరళ వ్యాప్తంగా ఓనం పండగలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఏటా ఆగస్టు- సెప్టెంబర్ మాసంలో వచ్చే ఈ పండగను సుమారు పది రోజుల పాటు జరుపుకొంటారు.

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ ఓనం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో కూలీ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ఇంట్లోనూ ఓనం వేడుకలు ఘనంగా జరిగాయి

ఈ సందర్భంగా స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఓనం పండగను సెలబ్రేట్ చేసుకున్నారు సౌబిన్ కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా అందరూ నూతన వస్త్రాలు ధరించి ముస్తాబయ్యారు.

అనంతరం తమ ఓనం వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సౌబిర్ అందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరవలవుతున్నాయి.

ఈ మలయాళ నటుడు షేర్ చేసిన ఫొటోలను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సౌబిన షాహిర్ ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

మలయాళంలో స్టార్ నటుడిగా వెలుగొందుతున్నాడు సౌబిన్ షాహిర్. మంజుమ్మల్ బాయ్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూలీ సినిమాతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.




