AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి పని ఒత్తిడి పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (March 14, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో అదనపు బాధ్యతల్ని కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు బాగా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారికి పని ఒత్తిడి పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 14 March 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 14, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (మార్చి 14, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో అదనపు బాధ్యతల్ని కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు బాగా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మిత్రులతో విలాస జీవి తం గడుపుతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అదనపు బాధ్యతల్ని కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం బాగా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు బాగా పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా మంచిది కాదు. సొంత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాల్లో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ఫలితం ఉంటుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. తలపెట్టిన పనుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయామ ణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో సంతృప్తికర పరిస్థితులుంటాయి. అధికారుల నుంచి అండదండలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో చాలావరకు ఆర్థిక సమస్యల్ని అధిగమిస్తారు. లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కొందరు సన్నిహిత మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమాధిక్యత ఉండే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. గృహ, వాహన రుణాలకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడతారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితం బాగా సాఫీగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. దూరప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. వ్యక్తిగత పరిచయాలు బాగా పెరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక లావాదేవీలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి కలుగుతుంది. వాహన యోగం పడుతుంది. జీవిత భాగస్వామి తరఫు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకోకుండా లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధి కారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. రాబడికి లోటుండదు. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని బంధు మిత్రుల సహకారంతో పూర్తి చేస్తారు. చదువులకు సంబంధించి పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామి ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. వ్యయ ప్రయాసలతో కానీ ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి కావు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఇరుగుపొరుగుతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతానికి షేర్లు, స్పెక్యులేషన్ల జోలికి పోవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు, లక్ష్యాలను అందుకుంటారు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆఫర్ సమాచారం అందుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Follow Us