బ్రేకప్ బాధల నుంచి కోలుకున్నా.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అనుపమ..

Rajitha Chanti

Pic credit - Instagram

16 October 2026

 టాలీవుడ్ , కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఆమె ప్రేమ బ్రేకప్, డిప్రెషన్ , పెళ్లి విషయాలపై మీడియాతో ఓపెన్‌గా మాట్లాడారు. ఆమె 'క్రేజీ కళ్యాణం' ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

గతంలో ఒక వ్యక్తితో లవ్ బ్రేకప్ జరిగిందని, ఆ సమయంలో తాను తీవ్ర మనోవేదనకు గురై డిప్రెషన్ లోకి వెళ్ళినట్టు అనుపమ తెలిపారు.

ఆ బాధ నుంచి బయటపడేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, మానసికంగా కోలుకోవడానికి థెరపీలు కూడా తీసుకున్నానని ఆమె వెల్లడించారు.

మైండ్ నుండి ఆ చేదు జ్ఞాపకాలన్నింటినీ తొలగించుకుని, సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఇక నుంచి తనలో 'అనుపమ 2.0' వెర్షన్‌ను చూస్తారని అన్నారు

ఇదే సందర్భంలో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ... ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.

తన ఇంట్లో కూడా పెళ్లి కోసం ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని తెలిపారు. "నువ్వు సంతోషంగా ఉంటే చాలు, ఎప్పుడు చేసుకున్నా పర్లేదు అన్నారని తెలిపారు. 

అసలు పెళ్లి చేసుకోకపోయినా మాకు అభ్యంతరం లేదు" అని తన కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ అంతా సినిమాల మీదే ఉందని అన్నారు.