AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: పునీత్ చనిపోవడానికి.. హార్ట్‌ అటాక్ కారణం కాదు..! సంచలన విషయం బయటపెట్టిన డాక్టర్

Puneeth Rajkumar: పునీత్ చనిపోవడానికి.. హార్ట్‌ అటాక్ కారణం కాదు..! సంచలన విషయం బయటపెట్టిన డాక్టర్

Phani CH
|

Updated on: Oct 16, 2026 | 4:59 PM

Share

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ చివరి క్షణాలను ఆయనకు చికిత్స అందించిన డాక్టర్‌ రమణరావు మరోసారి గుర్తు చేసుకున్నారు. మరణానికి ముందు రోజు కాకుండా, అదే రోజు పునీత్‌ సుమారు గంటన్నర పాటు కిక్‌బాక్సింగ్‌ చేసినట్లు ఆయన తెలిపినట్లు కథనం చెబుతోంది. విపరీతంగా చెమటలు పట్టడంతో క్లినిక్‌కు వచ్చిన పునీత్‌కు ఈసీజీ పరీక్ష చేయగా గుండెపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు గుర్తించారని, వెంటనే ఆస్పత్రికి తరలించామని డాక్టర్‌ వివరించినట్లు సమాచారం.

సుమారు ఐదేళ్ల క్రితం ఇదే సమయంలో పునీత్‌ రాజక్‌ కుమార్‌ అందర్నీ శోకసంద్రంలోకి నెట్టి వెళ్లిపోయారు. యావత్తు కర్ణాటక రాష​్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింద. కేవలం 46 ఏళ్ల వయసులో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు జిమ్‌లో వ్యాయామం చేశాక కుప్పకూలిపోవడం దేశవ్యాప్తంగా అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. సరిగ్గా ఇదే సమయంలో అక్టోబర్‌ 29, 2021 గుండెపోటుతో మరణించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆవేళ ఆయనకు చికిత్స అందించిన వైద్యుడు డాక్టర్ రమణ రావు ఆయన మరణించింది గుండెపోటు వల్ల కాదంటూ షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. అంతేగాదు ఆయన కూడా పునీత్‌రాజ్‌కుమార్‌ హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోయానంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆవేళ ఆ చివర నిమిషంలో పునీత్‌కి ఏమైందో సవివరంగా వివరించారు ఆ డాక్టర్. పునీత్ డాక్టర్ చెప్పిన ప్రకారం..ఆ రోజు పునీత్‌ చేసిన వ్యాయామం ఆయన రోజు చేసే ఫిట్‌నెస్‌ దినచర్యకు భిన్నంగా ఉంది. పునీత్‌ ఆ రోజు తొలిసారిగా కిక్‌బాక్సింగ్‌ ప్రయత్నించారని, సుమారు గంటన్నరపాటు దాని కోసం శ్రమించారని అన్నారు. ఆ తర్వాతే ఆయన అస్వస్థతకు గురై వైద్యుడిని సంప్రదించారని సమాచారం. అయితే ఆయన ఆస్పత్రికి చేరుకోవడానికి సరిగ్గా నిమిషం ముందే ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని వెల్లడించారు. అలాగే డాక్టర్‌ రమణరావు తనకు పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. తాను పునీత్‌ని అప్పు అని ప్రేమగా పిలుస్తానని చెప్పారు. పునీత్ చాలా మంచి వ్యక్తి అని, తన కొడుకు లాంటి వాడని అన్నారు. తన రెండో కుమారుడు, పునీత్‌ మంచి స్నేహితులని, తరుచుగా కలిసి ఆడుకునేవారని చెప్పారు. అలాగే పునీత్‌ ఆఖరి నిమిషాలను గుర్తు చేసుకుంటూ డాక్టర్‌ ఇలా చెప్పుకొచ్చారు. తీవ్రమైన వ్యాయామం తర్వాత పునీత్ విపరీతమైన చెమటలతో తన క్లినిక్‌కు వచ్చారు. ఆ చెమట విపరీతంగా ఉండటం గమనించా అంటూ చెప్పుకొచ్చారు. అసలేం జరిగిందని పునీత్‌ని అడగగా..తాను జిమ్‌కు వెళ్లానని, అక్కడ గంటన్నర పాటు కిక్‌బాక్సింగ్ చేశానని పునీత్ తనతో చెప్పినట్టుగా డాక్టర్ చెప్పుకొచ్చారు . ఆ వేళే కొత్తగా ఆ వ్యాయామాన్ని ప్రయత్నించాడు, పైగా తీవ్ర అలసటకు లోనయ్యాడు. అదీగాక అతడి చెమటను చూస్తే తీవ్రత అర్థమై తక్షణమే ఈసీజీ తీయించాను. అందులో గుండె తీవ్రమైన ఒత్తిడికి లోనై ఉన్నట్లు తేలింది. “తక్షణమే మందులు ఇచ్చాను, వెంటనే ఆస్పత్రికి తరలించాం. ఆయన తన సొంత కారులోనే వెళ్లాడు. అంటూ డాక్టర్ ఆ రోజు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Telugu 10: ప్రేమే ఆమెకు శాపంగా.. డేంజర్‌ జోన్‌లో లవ్ బర్డ్‌…!

దేశం వదిలిపోవాలంటూ.. బాలీవుడ్ హీరోకు నోటీసులు

The Raja Saab: రాజాసాబే కాదు.. ఈయన చెప్పిన రీజనూ ఫెయిలే

Salman Khan: మళ్లీ అదే చెత్త ప్రశ్న.. కరణ్ దెబ్బకు షాకైన సల్మాన్

నెట్‌ఫ్లిక్స్‌లో లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హవా.. దెబ్బకు కపిల్ శర్మ షో వెనక్కి!

Follow Us