AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఒక్క సెకనులో ఎంత సంపాదిస్తారో తెలుసా..?

Mukesh Ambani Earnings: భారత అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపాదన గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దేశంలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ఆయనకు ఒక్క రోజు, గంట, నిమిషం, సెకనుకు ఎంత ఆదాయం వస్తుంది? ఆయన సంపద, జీతం, డివిడెండ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే, ఈ లెక్కల వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏమిటో తెలుసుకుందాం.

Janardhan Veluru
|

Updated on: Oct 16, 2026 | 4:58 PM

Share
భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ముఖేష్ అంబానీ ఒకరు. టెలికాం, రిటైల్, ఇంధనం సహా పలు రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌(RIL)కు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. జియో ఐపీవో నేపథ్యంలో ఆయన పేరు మార్మోగిపోతోంది. ఆసియాలోనే అగ్ర కుబేరుల్లో ఒకరైన ఆయన సంపద ఎంత? ఒక్క రోజులో..గంటలో.. నిమిషంలో.. సెకనులో ఎంత సంపాదిస్తారనే విషయాలపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. అయితే, ఆయన సంపదను నిఖర రోజువారీ ఆదాయంగా పరిగణించకూడదు.

1 / 6
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ముఖేష్ అంబానీ రోజువారీ సంపాదనను రూ.163 కోట్లుగా అంచనా వేసింది. ఆ లెక్క ఆధారంగా ఆయన ఆదాయాన్ని వివిధ సమయాలుగా విభజిస్తే ఇలా ఉంటుంది. ఒక్క సెకనుకు రూ.52,000 పైగా.. ఒక్క నిమిషానికి రూ.11.3 లక్షలు సంపాదిస్తారు. అంటే ఒక్క గంటకు రూ.6.79 కోట్లు.. ఒక్క రోజుకు రూ.163 కోట్లు సంపాదిస్తారు.

2 / 6
ముఖేష్ అంబానీ సంపదలో ఎక్కువ భాగం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఆయన కుటుంబానికి ఉన్న వాటాల విలువతో ముడిపడి ఉంటుంది. కంపెనీ షేరు ధర పెరిగితే ఆయన నికర సంపద పెరుగుతుంది. షేరు ధర పడిపోతే ముఖేష్ అంబానీ సంపద కూడా తగ్గుతుంది. అయితే ఈ సంపాదన ప్రతిరోజూ చేతికి వచ్చే ఆదాయంగా పరిగణించకూడదు.

3 / 6
2026 సెప్టెంబర్‌లో ప్రచురించిన ఒక ఆర్థిక విశ్లేషణ ప్రకారం, 2025–26 ఆర్థిక సంవత్సరానికి అంబానీ కుటుంబ ప్రమోటర్ సంస్థలకు వచ్చిన డివిడెండ్‌ను రోజువారీ సగటుగా లెక్కిస్తే సుమారు రూ.10.9 కోట్లు అవుతుంది. ఇది కూడా కుటుంబ ప్రమోటర్ సంస్థల డివిడెండ్ ఆధారంగా చేసిన లెక్క మాత్రమే.

4 / 6
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక నివేదిక ఆధారంగా వచ్చిన వార్తల ప్రకారం, ముఖేష్ అంబానీ 2025–26 ఆర్థిక సంవత్సరంలోనూ కంపెనీ నుంచి జీతం, భత్యాలు, ఇతర ఉద్యోగ ప్రయోజనాలు తీసుకోలేదు. ఇలా వరుసగా ఆరు సంవత్సరాలుగా ఆయన జీతం తీసుకోవడం లేదని 2026 మేలో వార్తలు వెలువడ్డాయి. అయితే, జీతం తీసుకోకపోవడం అంటే ఆయనకు ఇతర మార్గాల్లో ఆదాయం లేదని అర్థం కాదు. రిలయన్స్‌ కంపెనీ వాటాల ద్వారా ముఖేష్ అంబానీకి భారీగానే ఆదాయం అందుతుంది.

5 / 6
ఫార్చ్యూన్ ఇండియా 2026 జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ నికర ఆస్తుల విలువ రూ.8,67,624 కోట్లుగా ఉంది. ప్రస్తుత షేర్ మార్కెట్, పెట్టుబడుల విలువలో మార్పుల మేరకు ప్రస్తుత నికర ఆస్తుల విలువ రూ.7.5 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

6 / 6
Follow Us