AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పడుకునే ముందు పిస్తాపప్పు తింటే ఏమవుతుంది..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..

ముఖ్యంగా సాయంత్రం వేళ ఆకలి కాగానే చిప్స్, బిస్కెట్ల వంటి జంక్ ఫుడ్‌ను ఆశ్రయించి రోగాలను కొనితెచ్చుకుంటున్నాం. అయితే రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ప్రత్యామ్నాయం ఒకటి మన కళ్లముందే ఉంది. అదే ప్రకృతి మనకు ప్రసాదించిన డ్రై ఫ్రూట్స్. పడుకునే ముందు పిస్తాపప్పులు తింటే ఏమవుతుందో తెలుసుకుందాం..

రాత్రి పడుకునే ముందు పిస్తాపప్పు తింటే ఏమవుతుంది..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..
Health Benefits Of Pistachios
Krishna S
|

Updated on: Mar 13, 2026 | 10:28 PM

Share

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ ఆకలి వేయగానే చిప్స్, బిస్కెట్లు వంటి జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతుంటాం. ఇవి నోటికి రుచిగా అనిపించినా.. శరీరానికి మాత్రం తీవ్ర హాని చేస్తాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి ప్రసాదించిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణురాలు దీప్సిఖా జైన్ తెలిపారు.

పోషకాల గని.. ఈ డ్రై ఫ్రూట్స్

బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఎండుద్రాక్ష, పిస్తాపప్పులలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వాల్‌నట్స్, బాదంలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు చురుగ్గా పనిచేయడానికి తోడ్పడతాయి. వీటిలోని మంచి కొవ్వులు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎండుద్రాక్ష, ఖర్జూరం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.

పిస్తాపప్పుల ప్రత్యేకత

పోషకాహార నిపుణురాలు దీప్సిఖా జైన్ ప్రకారం.. రాత్రి వేళ పిస్తాపప్పులు తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. పిస్తాలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మనస్సును ప్రశాంతపరిచి, గుండె లయను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాళ్ళు బిగుసుకుపోయే సమస్య ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. దాదాపు 28 గ్రాముల పిస్తాలో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో 9 రకాల ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల కండరాల పునరుద్ధరణకు ఇది తోడ్పడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి వరం

డ్రై ఫ్రూట్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, పరిమితంగా తీసుకుంటే బరువు తగ్గడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా పిస్తాలో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి, అనవసరమైన చిరుతిళ్లపై కోరికను తగ్గిస్తుంది.

నిపుణుల సూచన

ఏదైనా అతిగా తింటే ప్రమాదకరమే. అందుకే రోజుకు 4-5 బాదం పప్పులు, 1-2 వాల్‌నట్స్, కొన్ని ఎండుద్రాక్షలు లేదా పరిమితంగా పిస్తాపప్పులు తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత