AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లివే

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి.

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లివే
OTT Movies
Basha Shek
|

Updated on: Mar 14, 2026 | 7:55 AM

Share

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల థియేటర్లు ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయి. పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడం, చిన్న సినిమాలు వచ్చినా ఆకట్టుకోకపోవడంతో ఈ పరిస్థితి కొనసాగుతోంది. అయితే వచ్చే వారం విడుదలవుతోన్న పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పైనే భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ శుక్ర వారం (మార్చి13) థియేటర్లలో ఎలాంటి సినిమాలు రిలీజవ్వలేదు. అయితే ఓటీటీలో మాత్రం ఆకట్టుకునే సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, విశ్వక్ సేన్ ఫంకీ, సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అలాగే వివిధ భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు కూడా ఓటీటీలో అలరిస్తున్నాయి. మరి ఈ వీకెండ్ లో ఏయే ఓటీటీలో ఏయే సినిమా, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం రండి.

ఇవి కూడా చదవండి

నెట్‌ఫ్లిక్స్‌ లో

  • ఫంకీ- తెలుగు సినిమా

  • వన్‌ పీస్‌: సీజన్‌2 (వెబ్‌సిరీస్)- ఇంగ్లిష్‌/తెలుగు
  • గ్లాడియేటర్‌2 (మూవీ)- ఇంగ్లీష్‌
  • వర్జీన్‌ రివర్‌: సీజన్‌7 (వెబ్‌సిరీస్) ఇంగ్లిష్‌
  • మేడ్ ఇన్ కొరియా- తెలుగు/ తమిళ్ సినిమా

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • కపుల్‌ ఫ్రెండ్లీ (మూవీ) తెలుగు/తమిళ్‌
  • లాక్‌డౌన్‌ (మూవీ) తమిళ్‌/తెలుగు
  • లోకల్‌టైమ్స్‌ (వెబ్‌సిరీస్) తమిళ్‌
  • ఆస్పిరెంట్స్‌ (వెబ్‌సిరీస్) హిందీ/తెలుగు
  • ది తాజ్‌ స్టోరీ (మూవీ) హిందీ/తెలుగు
  • స్కార్‌పెట్టా (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌/తెలుగు
  • యానివర్సిరీ (మూవీ)ఇంగ్లీష్‌/తెలుగు

ఈటీవీ విన్

  • నవాబ్ కేఫ్ : తెలుగు సినిమా

జీ5

  • భర్త మహాశయులకు విజ్ఞప్తి- తెలుగు సినిమా

  • బూకీ (మూవీ)- తమిళ్‌/తెలుగు
  • అంధప్యార్‌2 (వెబ్‌సిరీస్)- హిందీ

సన్‌నెక్ట్స్‌

  • ఫ్రైడే (మూవీ) -తమిళ్‌
  • సుక్రాన్‌ (మూవీ) మలయాళం

జియో హాట్‌స్టార్‌

  • రిసార్ట్‌ (వెబ్‌సిరీస్) తమిళ్‌/తెలుగు
  • జూటోపియా2 (మూవీ) ఇంగ్లిష్‌/తెలుగు
  • రూస్టర్‌ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌
  • ది మ్యాడిసన్‌ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లిష్‌

లయన్స్ గేట్ ప్లే

  • ది తాజ్ స్టోరీ : హిందీ/ తెలుగు సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us