AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG: గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే… ఈ టిప్స్‌ పాటించండి!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, గ్యాస్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఎల్‌పీజీ సిలిండర్‌ను ఎక్కువ రోజులు ఎలా ఉపయోగించాలో చాలా కుటుంబాలు ఆలోచిస్తున్నాయి. నిపుణుల సలహాతో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కొన్ని టిప్స్‌ గ్యాస్ ఆదాకు తోడ్పడతాయి.

SN Pasha
|

Updated on: Mar 14, 2026 | 8:00 AM

Share
ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా మన దేశంలో ఎల్‌పీజీ కొరత ఏర్పడటం, ఇటీవల గ్యాస్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా కుటుంబాలు ఒక సిలిండర్‌ను ఎక్కువ రోజులు ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నాయి. నిపుణులు చెబుతున్నట్లుగా కొన్ని చిన్న అలవాట్లు మార్చుకుంటే గ్యాస్‌ వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

1 / 5
మొదటిగా వంట చేసేటప్పుడు పాత్రలకు మూత పెట్టడం చాలా ముఖ్యం. పాత్రకు మూత పెట్టి వండితే వేడి త్వరగా నిలిచి ఆహారం త్వరగా ఉడుకుతుంది. దీంతో గ్యాస్‌ వినియోగం తగ్గుతుంది. అలాగే వంట ప్రారంభించే ముందు కావాల్సిన అన్ని పదార్థాలను సిద్ధం చేసుకోవడం కూడా అవసరం. మధ్యలో పదార్థాలు తీసుకురావడం వల్ల గ్యాస్‌ అనవసరంగా ఎక్కువ సేపు వెలిగిపోతుంది.

2 / 5
మరొక ముఖ్యమైన విషయం మంట పరిమాణం. చాలా మంది ఎక్కువ మంటపై వంట చేస్తే త్వరగా ఉడుకుతుందని భావిస్తారు. కానీ పెద్ద మంట ఎక్కువ గ్యాస్‌ వినియోగానికి కారణమవుతుంది. అవసరమైనంత మంటతో వంట చేయడం ఉత్తమం. అలాగే ప్రెషర్ కుక్కర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల గ్యాస్‌ ఆదా అవుతుంది. కుక్కర్‌లో వండితే ఆహారం త్వరగా ఉడికిపోతుంది.

3 / 5
గ్యాస్‌ స్టౌవ్‌, బర్నర్లను తరచుగా శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. బర్నర్‌ రంధ్రాలు మూసుకుపోతే మంట సరిగా రావడం లేదు, దీంతో గ్యాస్‌ ఎక్కువగా ఖర్చవుతుంది. అందుకే స్టౌవ్‌ను శుభ్రంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

4 / 5
అదేవిధంగా చిన్న పాత్రలో పెద్ద మంటపై వండడం కంటే పాత్ర పరిమాణానికి సరిపడే మంట ఉపయోగించడం మంచిది. ఫ్లాట్‌ బాటమ్‌ పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా వేడి సమానంగా పంచబడుతుంది. ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఒక గ్యాస్‌ సిలిండర్‌ను మరికొన్ని రోజులు ఎక్కువగా ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో కుటుంబ ఖర్చులు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..