AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శనివారం ఈ పనులు చేస్తే ధనలాభం ఖాయం? చేయకూడని పనులు ఏమిటి? పూర్తి వివరాలు

What to do on Saturday: శనివారం రోజు చేయాల్సిన, చేయకూడని పనులను తెలుసుకుందాం. శని కుజులకు శత్రుత్వం కాబట్టి ఘాటైన పదార్థాలు, కందిపప్పు తినకూడదు. కొత్త వస్త్రాలు కొనకూడదు. రావిచెట్టు ప్రదక్షిణలు, నీలం వస్త్రాలు ధరించడం, మూగ జీవాలకు బెల్లం తినిపించడం, శివాలయంలో పరిహారాలు, కర్పూరం ప్రయోగం అదృష్టాన్ని అందిస్తాయి.

శనివారం ఈ పనులు చేస్తే ధనలాభం ఖాయం? చేయకూడని పనులు ఏమిటి? పూర్తి వివరాలు
Saturday Rituals
Rajashekher G
|

Updated on: Mar 14, 2026 | 7:48 AM

Share

హిందూ మతంలో వారంలోని ప్రతి రోజుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ రోజు చేయాల్సి, చేయకూడని పనులు కూడా పూర్వ కాలం నుంచి వస్తున్నాయి. ఈరోజు శనివారం నాడు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి జ్యోతిష్య శాస్త్రంలో వివరించబడింది. శనివారం మనం అనుసరించే పద్ధతులు మన అదృష్ట దురదృష్టాలపై ప్రభావం చూపుతాయని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా, శనివారం రోజు కుజుడికి సంబంధించిన ఆహార పదార్థాలను తినకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనికి, కుజుడికి మధ్య శత్రుత్వం ఉంటుంది. ఘాటైన పదార్థాలు, ఎండుమిరపకాయలు, ఊరగాయ పచ్చళ్లు వంటివి కుజుడికి సంబంధించినవి. కాబట్టి వీటిని శనివారం తినకుండా ఉండటం మంచిది. అలాగే కందిపప్పు కూడా కుజుడికి ప్రియమైనది కాబట్టి శనివారం ఆహారంలో కందిపప్పును స్వీకరించకుండా ఉండటం ఉత్తమం. శనివారం కొత్త వస్త్రాలు కొనుగోలు చేయకూడదు.

శనివారం శుభ ఫలితాలన్నిచే పనులు..

శనివారం కొన్ని పనులు చేయడం ద్వారా శుభ ఫలితాలు, అదృష్టం కలుగుతాయి. శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఐదు ప్రదక్షిణలు చేసి పసుపు దారం కట్టాలి. ఇలా చేయడం వల్ల మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. రావి చెట్టు దగ్గర పంచదార కలిపిన నీళ్లు పోయడం వల్ల ధనలాభం కలుగుతుంది.

మూగ జీవాల పట్ల దయ చూపడం కూడా శనివారం శుభ ఫలితాలను తెస్తుంది. గోమాత, చేపలు, చీమలు, కోతులు వంటి వాటికి బెల్లంతో చేసిన పదార్థాలు తినిపిస్తే దురదృష్టం తొలగి అదృష్టంగా మారుతుంది.

ఏ వస్త్రాలు ధరించాలి..?

శనివారం నీలం రంగు వస్త్రాలు ధరించడం మంచిది. నీలం రంగు శనికి చాలా ప్రియం. నీలం రంగు వస్త్రాలు ధరించి వేంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వడం వలన మంచి జరుగుతుంది.

శివాలయానికి వెళ్లి..

ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నవారు శనివారం రోజు శివాలయంలో శివుడికి మారేడు దళాలు సమర్పించాలి. శివార్చన చేయించుకుంటే ఉద్యోగ సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు. అలాగే, నెలకు ఒకసారి శివాలయానికి ఒకటంపావు కేజీ బియ్యం దానం చేస్తే సంపద క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. శనివారం సాయంకాలం ఒక కొబ్బరికాయ తీసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టి కొట్టాలి. ఇది కూడా శుభప్రదం.

కర్పూర పరిహారంతో అదృష్టం..

కర్పూరం పరిహారం కూడా శనివారం పాటించదగినది. కర్పూరాన్ని ఒక పసుపు వస్త్రంలో మూట కట్టి పూజ గదిలో పెట్టి ప్రతిరోజు ధూపం వేయాలి. ఇలా చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మరొక కర్పూరం పరిహారం ఏమిటంటే, ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి కొద్దిగా కర్పూరం వేయాలి. దీనిని దేవుడి దగ్గర ఉంచి, శనివారం అంతా పూర్తయ్యాక ఆదివారం స్నానం చేసి, గ్లాసులోని కర్పూరం కలిపిన నీళ్లను ఏదైనా మొక్కలో పోయాలి. ఇలా చేయడం ద్వారా దురదృష్టం తగ్గి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి, శనివారం చేయాల్సిన పనులు చేసి, చేయకూడని పనులకు దూరంగా ఉండటం ద్వారా అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. టీవీ9 తెలుగు సంస్థ ధృవీకరించదు.)

Follow Us