AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తక్కువ ఎత్తు ఉన్నవారికి బెస్ట్ క్రూజర్ బైక్‌లు..స్టైలిష్ లుక్, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

ద్విచక్ర వాహన మార్కెట్లో తక్కువ ఎత్తు ఉన్న సవారీదారులకు అనువైన మోటార్ సైకిల్‌ను ఎంచుకోవడం ఒక సవాలుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా పవర్‌ఫుల్ క్రూజర్ లేదా రెట్రో-స్టైల్ బైక్‌లను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు సీటు ఎత్తు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 5.3 అడుగుల నుండి 5.6 అడుగుల ఎత్తు ఉన్నవారు భారీ బైక్‌లను ట్రాఫిక్‌లో నడపడం లేదా ఆగినప్పుడు పాదాలను నేలపై ఆరామంగా ఉంచడం కొంచెం కష్టం. అయితే, భారతదేశంలో తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు అద్భుతమైన బ్యాలెన్స్, విశ్వాసాన్ని ఇచ్చే మూడు సూపర్ క్రూజర్ బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Jul 15, 2026 | 7:21 PM

Share
భారతదేశంలో ఈ సమస్యకు మూడు మంచి ఎంపికలు ఉన్నాయి. బజాజ్ అవెంజర్, జావా 42 బాబర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350. ఈ మూడు బైక్‌లు ఆకర్షణీయమైన రూపం, మంచి పనితీరును కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, వాటి తక్కువ సీటు ఎత్తు పొట్టి రైడర్‌లకు మంచి సమతుల్యతను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ బైక్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

1 / 5
బజాజ్ అవెంజర్: తక్కువ ఎత్తు ఉన్న వారికి మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ బజాజ్ అవెంజర్. ఈ బైక్ సీటు ఎత్తు కేవలం 737 మిమీ (mm) మాత్రమే. ఈ విభాగంలోని బైక్‌లలో ఇదే అత్యంత తక్కువ సీటు ఎత్తు కావడం విశేషం. కేవలం 5 అడుగుల ఎత్తు ఉన్నవారు కూడా ఈ బైక్‌పై సులభంగా కూర్చుని తమ పాదాలను నేలపై ఉంచవచ్చు.

2 / 5
ఇది 220 సీసీ (cc) సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 19 PS పవర్, 17.55 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని బరువు కేవలం 163 కేజీలు మాత్రమే ఉండటం వల్ల రద్దీగా ఉండే నగరాల్లో కూడా సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.28 లక్షలుగా ఉంది.

3 / 5
జావా 42 బాబర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350: బజాజ్ అవెంజర్‌తో పాటు జావా 42 బాబర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బరువైన లుక్ ఇష్టపడే తక్కువ ఎత్తు గల రైడర్లకు బెస్ట్ ఆప్షన్స్. ఇవి రెండూ క్లాసిక్ రెట్రో లుక్‌తో పాటు అద్భుతమైన రోడ్ ప్రెజెన్స్‌ను అందిస్తాయి. వీటి తక్కువ సీటు డిజైన్ కారణంగా షార్ట్ రైడర్స్ లాంగ్ డ్రైవ్స్‌లో కూడా ఎలాంటి అలసట లేకుండా సులభంగా ప్రయాణించవచ్చు.

4 / 5
మీటియోర్ 350: ఇది క్లాసిక్ అండ్ ట్రెడిషనల్ క్రూజర్ స్టైల్. వెడల్పైన డ్యూయల్ సీట్, ఎత్తైన హ్యాండిల్‌బార్, విండ్‌స్క్రీన్ రిలాక్స్డ్ ఫుట్‌పెగ్ పొజిషన్‌తో లాంగ్ రైడింగ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ముందుకు చాచినట్లు ఉండే ఫుట్‌పెగ్స్ వల్ల రైడర్ వెన్నునొప్పి లేకుండా గంటల తరబడి ప్రయాణించవచ్చు. దీని సీటు భూమికి చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది. దీనివల్ల 5.2 నుండి 5.5 అడుగుల ఎత్తు ఉన్నవారు కూడా ట్రాఫిక్‌లో ఆగినప్పుడు తమ రెండు పాదాలను నేలపై ఆన్చి బైక్‌ను సులభంగా బ్యాలెన్స్ చేయవచ్చు.

5 / 5
Follow Us