AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 2nd ODI: 2వ వన్డే కోసం భారత జట్టు.. ఒక్క మార్పుతో మరింత బలంగా గిల్ సేన.. ఎవరొచ్చారంటే?

India vs England 2nd ODI Team India Playing XI: సమస్యలు, సవాళ్లు ఎలా ఉన్నప్పటికీ టీమిండియా ప్రస్తుతం ఉన్న ఫామ్‌తో ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించే సత్తా కలిగి ఉంది. రోహిత్, కోహ్లీలు ఫామ్‌లోకి వచ్చి, బౌలర్లు రాణిస్తే భారత్‌కు సిరీస్ విజయం నల్లేరుపై నడకే అవుతుంది.

IND vs ENG 2nd ODI: 2వ వన్డే కోసం భారత జట్టు.. ఒక్క మార్పుతో మరింత బలంగా గిల్ సేన.. ఎవరొచ్చారంటే?
India Vs England 2nd Odi Team India Playing Xi
Venkata Chari
|

Updated on: Jul 16, 2026 | 6:58 AM

Share

India vs England 2nd ODI Team India Playing XI: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, నేడు జరగనున్న రెండో వన్డేలోనూ విజయఢంకా మోగించాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక పోరుకు ముందు భారత జట్టును కొన్ని ప్రధాన సమస్యలు వేధిస్తుండగా, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తుది జట్టులో ఒక కీలక మార్పు చేసేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధమైనట్లు సమాచారం.

సిరీస్ కైవసంపై కన్నేసిన భారత్.. సమం చేయాలని ఇంగ్లాండ్..

కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, వన్డే సిరీస్‌లో మాత్రం వెనుకబడింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఆతిథ్య జట్టు పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ అత్యంత హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: అతను యమ డేంజర్.. ఏడుగుర్ని దింపినా ఒంటిచేత్తో మా దూల తీర్చాడు.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!

ఇవి కూడా చదవండి

గిల్ ఫిట్‌నెస్.. సీనియర్ల ఫామ్‌పై ఆందోళన..

రెండో వన్డేకు ముందు భారత శిబిరంలో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్ జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. తొలి వన్డేలో 80 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన గిల్, కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. అది కేవలం సాధారణ నొప్పి మాత్రమేనని భావిస్తున్నప్పటికీ, గతంలో ఇటువంటి సమస్యల కారణంగా అతను ఆసుపత్రిలో చేరిన దాఖలాలు ఉండటంతో వైద్య బృందం ప్రత్యేక నిఘా ఉంచింది. గిల్ అందుబాటులో లేకపోతే జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. మరోవైపు సీనియర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఫామ్ కూడా నిరాశపరుస్తోంది. తొలి మ్యాచ్‌లో త్వరగానే పెవిలియన్ చేరిన ఈ ఇద్దరు దిగ్గజాలు.. ఈ మ్యాచ్‌లోనైనా పాత ఫామ్‌ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: సూర్యకుమార్ కాదు, తిలక్ వర్మ అంతకన్నా కాదు.. కొత్త కెప్టెన్‌గా టీమిండియా తోపు ప్లేయర్..?

బుమ్రా మాయాజాలం.. ఆల్‌రౌండర్ల అండ..

భారత జట్టుకు అత్యంత సానుకూలమైన అంశం ఏమిటంటే.. దాదాపు 968 రోజుల తర్వాత వన్డేల్లోకి పునరాగమనం చేసిన స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్‌లోనే తన బౌలింగ్ మాయాజాలంతో ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. ఈ మ్యాచ్‌లోనూ బుమ్రా మంచి ఆరంభాన్ని ఇస్తే ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయవచ్చు. దీనికి తోడు ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శనతో జట్టును ఆదుకుంటున్నారు.

పిచ్ కోసమే ఆ ఒక్క మార్పు..!

కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఒక మార్పు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసినప్పటికీ 9 ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్న యువ పేసర్ గుర్నూర్ బ్రార్ స్థానంలో, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లోనూ బెంచ్‌కే పరిమితం కావలసి వస్తుంది.

ఇది కూడా చదవండి: వాళ్లు వేస్ట్, సైడ్ క్యారెక్టర్లంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. గంభీర్ పరువు కాపాడి హీరోలుగా మారిన ఇద్దరు

అంచనా ప్రకారం భారత తుది జట్టు: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.

Follow Us