AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను యమ డేంజర్.. ఏడుగుర్ని దింపినా ఒంటిచేత్తో మా దూల తీర్చాడు.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!

India vs England 1st ODI: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్హం వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్ల తేడాతో ఛేదించింది. కాగా, ఈ ఘోర పరాజయంపై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మ్యాచ్ అనంతరం స్పందిస్తూ తమ బ్యాటింగ్ వైఫల్యమే శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

అతను యమ డేంజర్.. ఏడుగుర్ని దింపినా ఒంటిచేత్తో మా దూల తీర్చాడు.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
IND vs ENG Harry Brook comments on axar patel
Venkata Chari
|

Updated on: Jul 15, 2026 | 7:00 AM

Share

భారత క్రికెట్ జట్టు విదేశీ గడ్డపై మరోసారి తన సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మ్యాచ్ ఆరంభంలో సీనియర్ బ్యాటర్లు విఫలమై తీవ్ర ఒత్తిడి ఎదురైనప్పటికీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్, లోయర్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చూపిన అసాధారణ పోరాట పటిమతో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఓటమి ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద షాక్ ఇచ్చింది.

మిడిల్ ఆర్డర్ కుప్పకూలడమే మా కొంపముంచింది..!

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 47.5 ఓవర్లలో 258 పరుగులకే పరిమితమైంది. ఒక దశలో 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆ జట్టును జో రూట్, లియామ్ డాసన్ 121 పరుగుల భాగస్వామ్యంతో కాపాడారు.

ఈ బ్యాటింగ్ వైఫల్యంపై ఇంగ్లాండ్ సారథి హ్యారీ బ్రూక్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. “ఇది మేము అస్సలు ఊహించని ఫలితం. మిడిల్ ఓవర్లలో కేవలం 20 నుంచి 25 పరుగుల వ్యవధిలోనే వరుసగా 5 కీలక వికెట్లు కోల్పోయాం. అదే మా ఓటమిని పూర్తిగా శాసించింది. జో రూట్, డాసన్ అద్భుతంగా పోరాడి మంచి స్కోరు అందించినా, మిగతా బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. మేము బోర్డుపై కనీసం 300కు పైగా పరుగులు ఉంచి ఉంటే మా స్పిన్నర్లు మ్యాచ్‌ను శాసించేవారు” అని బ్రూక్ పేర్కొన్నాడు.

అక్షర్ పటేల్ మాయాజాలం.. పిచ్ మారడంపై అసహనం..

భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. బౌలింగ్‌లో 4 కీలక వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ 57 పరుగులతో అదరగొట్టి ఇంగ్లాండ్ జట్టుకు విజయాన్ని దూరం చేశాడు.

దీనిపై బ్రూక్ మాట్లాడుతూ.. “అక్షర్ పటేల్ బౌలింగ్, బ్యాటింగ్ రెండూ మా ఓటమికి ప్రధాన కారణాలు. మేము ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించినా కూడా భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టలేకపోయాం. దీనికి తోడు మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ ప్రవర్తన కూడా మారిపోయింది. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే భారత్ బ్యాటింగ్ చేసే సమయానికి పిచ్ చాలా నెమ్మదించింది. దాంతో వారు సులువుగా పరుగులు సాధించగలిగారు” అని పిచ్ మారడంపై అసహనం వ్యక్తం చేశాడు.

భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో చెలరేగగా, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసి 28 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించింది. అద్భుతమైన ప్రదర్శనతో జట్టును గెలిపించిన అక్షర్ పటేల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. ఈ విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన టీం ఇండియా, తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us