AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Records: భారత బౌలర్లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డుకు అడుగు దూరంలో చాహల్

Cricket Records: టీ20 క్రికెట్‌లో యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించేందుకు చేరువయ్యాడు. ప్రస్తుతం 396 వికెట్లతో ఉన్న చాహల్ మరో నాలుగు వికెట్లు తీస్తే 400 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించే అవకాశం అతని ముందుంది. రషీద్ ఖాన్ సహా విదేశీ బౌలర్లు ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పారు.

Cricket Records: భారత బౌలర్లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డుకు అడుగు దూరంలో చాహల్
Yuzvendra Chahal
Rakesh
|

Updated on: Aug 06, 2026 | 7:19 PM

Share

Cricket Records: టీ20 క్రికెట్‌ను సాధారణంగా బ్యాటర్ల గేమ్‌గా పరిగణిస్తారు. కానీ గత కొన్నేళ్లుగా తమ అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో ఈ ఫార్మాట్‌పై చెరగని ముద్ర వేసిన బౌలర్లు ఎందరో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు దిగ్గజ బౌలర్లు టి20 క్రికెట్‌లో 500 కంటే ఎక్కువ వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. వీరిలో అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అందరికంటే ముందువరుసలో ఉన్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే వేర్వేరు టి20 లీగ్‌లలో నిలకడగా రాణిస్తూ రషీద్ ఖాన్ ఏకంగా 700 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, వేరియేషన్లు ప్రత్యర్థి బ్యాటర్లను తీవ్రంగా ముప్పుతిప్పలు పెడుతుంటాయి.

500 వికెట్ల క్లబ్‌లో మెరిసిన విదేశీ దిగ్గజాలు

రషీద్ ఖాన్ తర్వాత వెస్టిండీస్ స్టార్ ఆటగాళ్లు సునీల్ నరైన్, డ్వేన్ బ్రావో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నిలిచారు. వీరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) లతో పాటు ప్రపంచంలోని ప్రముఖ టి20 లీగ్‌లలో తమ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు పెద్ద సవాలుగా మారారు. వీరితో పాటు సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్లు కూడా టి20ల్లో 500 కంటే ఎక్కువ వికెట్లు తీసిన దిగ్గజాల ప్రత్యేక జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

భారత బౌలర్లకు ఇంకా దక్కని 400 వికెట్ల మైలురాయి

విదేశీ బౌలర్లు 500 నుండి 700 వికెట్ల వరకు పడగొట్టి రికార్డులు సృష్టిస్తుంటే.. భారత బౌలర్ల విషయానికి వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు ఏ ఒక్క భారత బౌలర్ కూడా టి20 క్రికెట్‌లో కనీసం 400 వికెట్ల మార్క్‌ను చేరుకోలేకపోయారు. ప్రస్తుతం భారత బౌలర్లలో అగ్రస్థానంలో ఉన్న యుజ్వేంద్ర చాహల్ పేరు మీద 396 వికెట్లు నమోదయ్యాయి. చాహల్ ఐపీఎల్, దేశవాళీ టి20ల్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ, ఆ ప్రతిష్టాత్మకమైన 400 వికెట్ల మైలురాయికి ఇంకా కొద్ది దూరంలోనే నిలిచిపోయారు.

భారత బౌలర్లు వెనుకబడటానికి ప్రధాన కారణాలు

భారత బౌలర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. టి20 వికెట్ల సంఖ్యలో వెనుకబడటానికి బీసీసీఐ నియమావళే ప్రధాన కారణం. విదేశీ ఆటగాళ్లలాగా భారత పురుష క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా జరిగే బిగ్ బాష్ లీగ్, సీపీఎల్, పీఎస్ఎల్, ది హండ్రెడ్ వంటి ఇతర దేశాల టి20 లీగ్‌లలో ఆడటానికి అనుమతి లేదు. భారత ఆటగాళ్లు కేవలం ఐపీఎల్, అంతర్జాతీయ టీ20లు మాత్రమే ఆడటం వల్ల వారికీ లభించే మ్యాచ్‌ల సంఖ్య పరిమితంగా ఉంటుంది. అందువల్లనే 500 వికెట్ల క్లబ్‌లో భారత బౌలర్లు ఇంకా అడుగుపెట్టలేకపోయారు. రాబోయే కాలంలో యుజ్వేంద్ర చాహల్ 400 వికెట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!