AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..? కిటికీలోంచి స్వర్గం కనిపిస్తుంది!

రైలు ప్రయాణం అంటేనే అందమైన ప్రకృతి దృశ్యాలు, కిటికీ పక్కన కూర్చుని ఆస్వాదించే తీపి జ్ఞాపకాలు. కానీ, ప్రయాణంలో కిటికీ బయటి ప్రకృతి అందాలను చూస్తూనే, ముక్కుకు ఆక్సిజన్ మాస్క్ ధరించాల్సిన పరిస్థితి వస్తే? వినడానికి కాస్త వింతగా అనిపించినా, ఇది నిజం! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ప్రస్తుతం ఇదే అనుభూతిని పొందుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Watch: ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..? కిటికీలోంచి స్వర్గం కనిపిస్తుంది!
Worlds Highest Railway
Jyothi Gadda
|

Updated on: Aug 10, 2026 | 3:47 PM

Share

కిటికీలోంచి బయటకు చూస్తుంటే.. హృదయాన్ని హత్తుకునే దృశ్యాలు ఒకవైపు.. నోటికి ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుకోవాల్సి పరిస్థితి మరొకవైపు.. ఇలాంటి వింత రైలు ప్రయాణం ఉంటుందని ఎవరూ ఊహించని కూడా ఉండరు.. కానీ, ఇది నిజం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గంలో ప్రయాణానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. చైనాలోని జినింగ్, లాసా మధ్య సుమారు 22 గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో రైలు 16,500 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకుంటుంది. అక్కడ ఆక్సిజన్ స్థాయి తీవ్రంగా పడిపోతుంది. ప్రయాణ సమయంలో, రైలు పర్వతాల గుండా ముందుకు సాగుతున్నప్పుడు, ప్రయాణికులకు అకస్మాత్తుగా ఊపిరాడనట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో, ప్రయాణికుల ముఖాల్లో భయానికి బదులుగా ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఏంటా వింత పరిస్థితి..?

16,500 అడుగుల ఎత్తులో రైలు ప్రయాణం:

చైనాలోని సీనింగ్ నగరం నుంచి టిబెట్‌లోని లహాసా వరకు నడిచే ఈ రైలు, ప్రపంచంలోనే అతి ఎత్తైన రైలు మార్గంగా రికార్డు సృష్టించింది. దాదాపు 22 గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో, రైలు సముద్ర మట్టానికి సుమారు 16,500 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకుంటుంది. పర్వతాల గుండా సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు ఎనలేని థ్రిల్‌ను ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆక్సిజన్ మాస్క్ తప్పనిసరి ఎందుకు?:

సాధారణంగా ఎత్తైన ప్రాంతాలకు వెళ్లే కొద్దీ వాతావరణంలో గాలి పల్చబడి ఆక్సిజన్ స్థాయిలు వేగంగా పడిపోతాయి. ఈ రైలు ప్రయాణంలో కూడా 16,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకున్నప్పుడు గాలిలో ఆక్సిజన్ శాతం దాదాపు 40శాతం వరకు తగ్గిపోతుంది. దీనివల్ల సాధారణ వ్యక్తులకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారి, మైకం లేదా ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

రైలులోనే ప్రత్యేక ఆక్సిజన్ సౌకర్యం:

ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైలు యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రైలులోని ప్రతి బర్త్ సమీపంలోనూ ఆక్సిజన్ అవుట్‌లెట్‌లు అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు ఈ ఆక్సిజన్ మాస్క్‌ను తమ ముక్కుకు అమర్చుకుని ఎటువంటి అసౌకర్యం లేకుండా హాయిగా శ్వాస తీసుకోవచ్చు.

వీడియో ఇక్కడ చూడండి..

స్వర్గాన్ని తలపించే ప్రకృతి దృశ్యాలు:

ఒకవైపు శ్వాస సమస్యలు ఎదురవుతున్నా, ప్రయాణికుల్లో భయం కంటే ఉత్సాహమే ఎక్కువగా కనిపిస్తుంది. కిటికీ బయట కనిపించే మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, పచ్చని మైదానాలు, నిర్మలమైన సరస్సులు ప్రయాణికులకు స్వర్గంలో విహరిస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. అంతేకాకుండా, ఈ రైలులో విలాసవంతమైన స్లీపర్ బెడ్స్, రెస్టారెంట్ వంటి ఆధునిక వసతులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అద్భుతమైmన సాహసవంతమైన ప్రయాణం పర్యాటకులకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక అరుదైన అనుభవాన్ని అందిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us