AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్లు వేస్ట్, సైడ్ క్యారెక్టర్లంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. గంభీర్ పరువు కాపాడి హీరోలుగా మారిన ఇద్దరు

Gautam Gambhir Coaching Strategy: వరుస పరాజయాల గాయం తర్వాత టీమిండియా సింహంలా గర్జించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అసాధారణ పోరాట పటిమను కనబరిచి ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. సీనియర్ల వైఫల్యంతో ఒకానొక దశలో ఓటమి కోరల్లో చిక్కుకున్న భారత్‌ను ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తమ అద్భుత ప్రదర్శనతో గట్టెక్కించి, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో ఆనందాన్ని నింపారు.

వాళ్లు వేస్ట్, సైడ్ క్యారెక్టర్లంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. గంభీర్ పరువు కాపాడి హీరోలుగా మారిన ఇద్దరు
Axar Patel, Washington Sundar Allround Performance
Venkata Chari
|

Updated on: Jul 15, 2026 | 8:09 AM

Share

Axar Patel, Washington Sundar Allround Performance: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ ఒక సాధారణ పోరులా కాకుండా, ప్రతి క్షణం ఉత్కంఠ రేకెత్తించే రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపించింది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో టీ20 సిరీస్‌లు కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు, బూడిద నుంచి లేచిన ఫీనిక్స్ పక్షిలా ఈ మ్యాచ్‌లో పుంజుకుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో 2014 తర్వాత ఇంగ్లాండ్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అంటే సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ తన సొంత కోటలో ఓటమి చవిచూసింది. విశేషం ఏంటంటే, అప్పుడు, ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టింది మన టీమిండియానే కావడం విశేషం.

ప్రసిద్ధ కృష్ణ ప్రళయం.. లూజ్ వదిలిన రూట్

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఓపెనర్లు వికెట్ పడకుండా 51 పరుగులు చేయడంతో భారత అభిమానుల్లో గుబులు మొదలైంది. అయితే, కుర్రాడు గుర్నూర్ బ్రర్ ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ వెంటనే జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ ఒకే ఓవర్లో జోస్ బట్లర్, సామ్ కరన్‌లను పడగొట్టి ఇంగ్లాండ్‌ను 80 పరుగులకే 5 వికెట్లతో పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు.

ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్‌లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్‌కు 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే..?

ఇవి కూడా చదవండి

కానీ, స్టార్ బ్యాటర్ జో రూట్ ఇచ్చిన క్యాచ్‌ను శివం దూబే నేలపాలు చేయడంతో ఇంగ్లాండ్‌కు లైఫ్ దొరికింది. ఆ అదృష్టంతో జో రూట్ (75), లియాం డాసన్ (75) కలిసి 7వ వికెట్‌కు రికార్డు స్థాయిలో 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒకానొక దశలో మన బౌలర్లకు నరకం చూపించిన ఈ జోడీని చివర్లో అక్షర్ పటేల్ తన మాయాజాలంతో అడ్డుకున్నాడు. కేవలం 62 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్‌ను 258 పరుగులకే కట్టడి చేశాడు.

కూలిన పిల్లర్లు.. గాయపడ్డ రాకుమారుడు..

259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే మైండ్ బ్లాక్ అయ్యే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (5) చేతులెత్తేయడంతో టీం ఇండియా తీవ్ర ఒత్తిడిలో పడింది. ఇలాంటి కష్టసమయంలో యువ రాకుమారుడు శుభ్‌మన్ గిల్ మైదానంలో రాజసం చూపిస్తూ ఇంగ్లాండ్ బౌలర్లను ఆడుకున్నాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇది కూడా చదవండి: Kohli vs Gambhir: టీమిండియాలో ముదిరిన విభేదాలు.. కోచ్ గంభీర్, కోహ్లీ మధ్య మాటలు బంద్..?

అయితే గిల్ 80 పరుగుల వద్ద ఉన్నప్పుడు కాలి కండరాలు పట్టేయడంతో (క్రాంప్స్) రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. గిల్ వెళ్ళిపోవడమే ఆలస్యం.. భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. శ్రేయస్ అయ్యర్ రనౌట్ అవ్వగా, కేఎల్ రాహుల్ కేవలం ఒక పరుగుకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేవలం మూడు ఓవర్ల వ్యవధిలో ముగ్గురు కీలక బ్యాటర్లు దూరం కావడంతో భారత్ ఓటమి అంచుల్లో నిలిచింది.

అక్షర్, సుందర్.. అసలైన మ్యాచ్ విన్నర్లు

విమర్శకులు సైడ్ క్యారెక్టర్లుగా విమర్శించిన అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్‌కు మెయిన్ హీరోలుగా మారారు. పిచ్‌పై ఇంగ్లాండ్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నా భయపడకుండా ఎదురొడ్డి నిలిచారు. అక్షర్ పటేల్ కేవలం 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాది ఇంగ్లాండ్ బౌలర్ల గుండెల్లో నిద్రపోగా, మరో ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ క్లాస్ బ్యాటింగ్‌తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ అండగా నిలిచాడు. ఇద్దరూ పోటీ పడి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. చివరకు 46వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ కళ్ళు చెదిరే సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడమే కాకుండా, తన అర్ధ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. అక్షర్ పటేల్ 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, వన్డేల్లో ఒకే మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు చేసి, 4 వికెట్లు తీసిన ఆరో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు దద్దమ్మలు ఇక ఇంటికే.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన పులి.. కోహ్లీ దోస్త్ గ్రాండ్ ఎంట్రీ?

భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆల్రౌండర్లపై పెడుతున్న నమ్మకం ఈ మ్యాచ్‌తో నిజమైంది. రాబోయే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని గంభీర్ వేస్తున్న వ్యూహాలు సరైన దిశలోనే సాగుతున్నాయని ఈ విజయం నిరూపించింది. అక్షర్, సుందర్ చూపించిన ఈ అసమాన పోరాటం టీమిండియాకు సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందించడమే కాకుండా, యువ ఆటగాళ్లలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us