AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli vs Gambhir: టీమిండియాలో ముదిరిన విభేదాలు.. కోచ్ గంభీర్, కోహ్లీ మధ్య మాటలు బంద్..?

Gautam Gambhir vs Virat Kohli: మరికొద్ది గంటల్లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ మొదలుకానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇదే కోచ్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య చెడిందని తెలుస్తోంది.

Venkata Chari
|

Updated on: Jul 14, 2026 | 12:33 PM

Share
భారత క్రికెట్ జట్టులో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయనే వార్తలు క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వారిద్దరూ కనీసం మాట్లాడుకోవడం కూడా లేదనే సంచలన విషయాలు ఇప్పుడు బయటకు వచ్చి అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

1 / 5
డ్రెస్సింగ్ రూమ్‌లో ముదిరిన వివాదం..: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, జింబాబ్వే టూర్‌లో లంకతో జరిగిన సిరీస్ తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య మనస్పర్థలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఒకప్పుడు మైదానంలో దూకుడుగా ఉంటూ, ఆ తర్వాత ఒక్కటైనట్లు కనిపించిన ఈ ఇద్దరు ఢిల్లీ ఆటగాళ్ల మధ్య ఇప్పుడు మాటలు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. జట్టు ప్రయోజనాలు, భవిష్యత్తు వ్యూహాల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు తలెత్తడమే ఇందుకు ప్రధాన కారణమని సమాచారం.

2 / 5
2027 ప్రపంచకప్ వ్యూహాలే చిచ్చు పెట్టాయా?: వచ్చే 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టులో భారీ మార్పులు చేయాలని, యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని గౌతమ్ గంభీర్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. అయితే, సీనియర్ ఆటగాళ్లను ఉన్నపళంగా పక్కన పెట్టడం లేదా వారిపై ఒత్తిడి పెంచడం వంటి నిర్ణయాలను విరాట్ కోహ్లీ జీర్ణించుకోలేకపోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్లలో కూడా వీరిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడానికి గానీ, వ్యూహాల గురించి చర్చించడానికి గానీ ఆసక్తి చూపడం లేదని జట్టుకు అత్యంత సమీప వర్గాలు వెల్లడించాయి.

3 / 5
పెదవి విప్పని మేనేజ్‌మెంట్.. ఆందోళనలో అభిమానులు.: గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా గంభీర్, కోహ్లీల మధ్య జరిగిన మైదాన గొడవలు అందరికీ తెలిసినవే. ఆ తర్వాత గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూలు ఇస్తూ అంతా బాగుందని నమ్మించారు. కానీ, ఇప్పుడు మళ్లీ పాత విభేదాలు తలెత్తడం, కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం జట్టు వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. ఈ విషయంపై బీసీసీఐ పెద్దలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, తెరవెనుక మాత్రం గంభీర్ కఠిన వైఖరిపై చర్చలు జరుగుతున్నట్లు క్రీడా వర్గాల టాక్.  

4 / 5
క్రికెట్ జట్టులో కోచ్, సీనియర్ ఆటగాడి మధ్య సత్సంబంధాలు ఉండటం ఎంతో ముఖ్యం. రాబోయే కీలకమైన సిరీస్‌ల కంటే ముందే గంభీర్, కోహ్లీల మధ్య ఉన్న ఈ దూరం తగ్గకపోతే, అది టీమిండియా ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. బీసీసీఐ జోక్యం చేసుకుని ఈ వివాదానికి వీలైనంత త్వరగా తెరదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

5 / 5
Follow Us