AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో! టీఆర్పీ రికార్డులు బద్దలవుతాయంతే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛింగ్ కు మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ సారి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా వెలుగొందిన ఒకరు ఈసారి బిగ్ బాస్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో! టీఆర్పీ రికార్డులు బద్దలవుతాయంతే
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Aug 03, 2026 | 7:35 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్10 గ్రాండ్ లాంఛింగ్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు ఈసారి ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈ రియాలిటీ షోలో మరిన్ని హంగులు, మార్పులు ఉండనున్నాయని తెలుస్తోంది. అలాగే గేమ్స్, టాస్కుల పరంగానూ కొత్త రూల్స్ ను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సామాన్యుల కోసం త్వరలోనే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ కూడా ప్రారంభం కానున్నట్లు గత బిగ్ బాస్ సీజన్ విజేత పవన్ కల్యాణ్ పడాల వెల్లడించాడు. మరోవైపు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు వస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే రోజుకో సెలబ్రిటీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతమున్న సమచారం ప్రకారం పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ వైఫ్ జ్యోతి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నందూస్ వరల్డ్ అలియాస్ నందు, రాయల్ ఎంసీ రమణ, శివ్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రైటర్ కడలి సత్యనారాయణ, వర్ష, పవిత్ర, వర్షిణీ.. ఇలా చాలా మంది పేర్లు బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి ఒక ప్పటి స్టార్ హీరో చేరింది. అతను మరెవరో కాదు ఒకప్పుడు ప్రేమ దేశం సినిమాతో యూత్ ఫేవరెట్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్.

తెలుగు, తమిళం భాషల్లో కలిపి మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించాడు అబ్బాస్. అయితే 2009 తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో న్యూజిలాండ్ వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయాడీ హ్యాండ్సమ్ హీరో. కుటుంబ పోషణ కోసం పెట్రోల్ బంక్ లో పని చేశాడు. అలాగే మెకానిక్ గానూ వర్క్ చేశాడు. అయితే ఇప్పుడీ హీరో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేశాడు. ఇప్పటికే ఒక సూపర్ హిట్ సినిమాతో పాటు వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో అబ్బాస్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ యాజమాన్యం అతన్ని హౌస్ లోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఒక వేళ అబ్బాస్ గనక బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఈ రియాలిటీ షోకు మరింత క్రేజ్, హైప్ వస్తుంది. భారీ వ్యూయర్ షిప్ వచ్చే అవకాశం ఉంది. అయితే బిగ్ బాస్ 10లోకి అబ్బాస్ వస్తున్నాడా? రాదా? అన్నది తెలియాలంటే ఈ రియాలిటీ షో గ్రాండ్ లాంచింగ్ దాకా వేచి ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి

సినిమా షూటింగ్ లో అబ్బాస్..

View this post on Instagram

A post shared by Abbas Ali (@iamactorabbas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us