Rashmika Mandanna: ఇలాంటివి నాకు కొత్తేమీ కాదు.. ఇది మూడోసారి..! గాయంపై స్పందించిన రష్మిక మందన్న ..
ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ రష్మిక మందన్నా. అలాగే అటు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా మారింది. తెలుగు, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడికి గాయం అయిన విషయం తెలిసిందే..

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా షూటింగ్ లో గాయపడిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న తర్వాత రష్మిక తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఒక వైపు విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’, అలాగే లేడి ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’ చిత్రాల షూటింగ్‌ల్లో పాల్గొంటుంది రష్మిక. ఈ చిత్రాల్లోని యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ సీక్వెన్సుల కోసం నిరంతరం శ్రమించడంతో ఆమెకు హిప్ ప్రాంతంలో తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. దాంతో రష్మిక అభిమానులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్మిక ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. వైద్యుల సమాచారం ప్రకారం, రష్మిక హిప్ ఏరియాలోని టెండన్ పూర్తిగా డిటాచ్‌మెంట్ కావడంతో పరిస్థితి తీవ్రంగా ఉందని వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి గాయాలు తీవ్ర స్థాయిలో శారీరక శ్రమ చేసే ప్రొఫెషనల్ క్రీడాకారుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తుంది. కాగా రష్మిక తన గాయం పై తొలిసారి స్పందించింది.
ఇది కూడా చదివేసేయండి : అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా
తన ఆరోగ్యం పై అప్డేట్ ఇచ్చింది రష్మిక మందన్న ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. “గాయాలు అవ్వడం నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఎవరికి తెలియకూడదు అనుకున్నా కానీ తెలిసిపోయిందీ.. నాకు ఇలాంటి గాయం కావడం ఇది మూడవసారి. నా తుంటికి కాలును కలిపే టెండన్స్ ఒక్కో వైపు నాలుగు ఉంటాయి. నా కుడి తుంటికి సంబంధించి ఒక టెండెన్ ఊడిపోయింది. నేను కాలు పైకి ఎత్తాలి అంటే అది మళ్లీ అతుక్కోవాలి. మైసా సినిమా కోసం డాన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఇలా జరిగింది. నేను చేసిన సినిమాల్లో మైసా అత్యంత కఠినమైన సినిమా.. నేను విశ్రాంతి తీసుకోవడానికే దేవుడు నాకు ఈ గాయం ఇచ్చాడు అనుకుంటా అంటూ రాసుకొచ్చింది రష్మిక. అలాగే బరువు పెరగకుండా ఉండటానికి నిజంగా చాలా ప్రయత్నిస్తున్నాను, ఎందుకంటే నేను ఒక యానిమల్‌లా వర్కౌట్ చేస్తాను, పరుగెడతాను, దానివల్ల నేను మంచి ఆకారంలో ఉంటాను. ఇప్పుడు నేను కొంతకాలం వర్కౌట్ చేయలేను, పరుగెత్తలేను. ఒకవేళ నేను వర్కౌట్ చేయలేకపోతే అప్పుడు నేనేం చేస్తాను.. తినేస్తాను.. ఇక డెజర్ట్‌ల రాక్షసిగా మారిపోతాను అంటూ సరదాగా రాసుకొచ్చింది రష్మిక.
ఇది కూడా చదివేసేయండి : సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది. వరుస సినిమాలు, బ్లాక్ బస్టర్స్ తో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక పుష్ప, పుష్ప 2, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఇక రష్మిక గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు.
ఇది కూడా చదివేసేయండి : ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట
Hie guyssss!🥰❤️
Injuries suck.. 😩 and I was really hoping that no one will get to know.. but well 🐒🤷🏻♀️
Sorry I’ve been MIA 🐒 but hieeee! I’m hereeee!🙋🏻♀️😁
It happened awhile ago ya and this is my 3rd injury back to back.. 🤦🏻♀️ I should definitely learn to treat my body like a… pic.twitter.com/yJj70yEyAE
— Rashmika Mandanna (@iamRashmika) August 3, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




