ఒకప్పుడు సేల్స్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

22 September 2026

తెలుగు బుల్లితెరపై పాపులర్ సీరియల్ 'గుండెనిండా గుడిగంటలు'లో విలన్ రోహిణి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి జ్యోతిక మునిరత్నం.

స్క్రీన్ పై తన నటనతో నెగెటివ్ షేడ్స్‌ను అద్భుతంగా పండిస్తూ, బుల్లితెర ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

జ్యోతిక మునిరత్నం స్వస్థలం కర్ణాటక. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె కన్నడ బుల్లితెరపై నటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు.

అక్కడ కొన్ని సీరియళ్లలో నటించి మంచి అనుభవం సంపాదించిన తర్వాత, 'కళ్యాణి' సీరియల్ ద్వారా తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు.

సీరియళ్లలో ఎప్పుడూ చీరకట్టుతో, సంప్రదాయబద్ధంగా కనిపించే జ్యోతిక, నిజ జీవితంలో మాత్రం చాలా స్టైలిష్‌గా ఉంటుంది ఈ అందాల తార.

సోషల్ మీడియా వేదికగా మోడరన్, వెస్టర్న్ అవుట్‌ఫిట్స్‌లో సరికొత్త ఫోటోషూట్‌లను షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది  ఈ అమ్మడు. 

నిజ జీవితంలో ఎంతో సరదాగా ఉండే ఆమెకు పర్యటనలన్నా, ఫ్యాషన్ ఫోటోషూట్లన్నా ఎంతో ఇష్టం. ప్రస్తుతం నెగెటివ్ రోల్స్ చేస్తుంది జ్యోతిక. 

ఆమె క్రేజ్, డిమాండ్‌ను బట్టి రోజుకు రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది.