కుందనపు బొమ్మలా మెరిసిన మృణాల్ ఠాకూర్.. కుర్రాళ్ళు ఫిదా  

21 September  2026

Rajeev 

Pic credit - Instagram

అందం, అభినయం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కథానాయికల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు.

హిందీ సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి వరుస విజయవంతమైన చిత్రాల్లో భాగమైంది.

ముఖ్యంగా సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. మృణాల్ కెరీర్‌లో సీతారామం సినిమా ఒక కీలక మలుపుగా నిలిచింది.

దుల్కర్ సల్మాన్ సరసన సీత మహాలక్ష్మి పాత్రలో ఆమె కనిపించింది. ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఈ పాత్రను మృణాల్ తనదైన శైలిలో పండించడంతో తెలుగు ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ తెచ్చుకుంది.

సీతారామం తర్వాత మృణాల్ మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన చిత్రం హాయ్ నాన్న. ఈ చిత్రం ఆమెకు మరో మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. అలాగే కల్కి 2898 ఏడీలోనూ ఆమె ప్రత్యేక పాత్రలో కనిపించింది.

హిందీ, తెలుగు సినిమాల్లో ఒకేసారి పనిచేస్తూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ