AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Blessings: శుక్రుడి కటాక్షం.. వీరి జీవిత భాగస్వామికి అదృష్టమే అదృష్టం..!

జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు జీవిత భాగస్వామికి కారకుడు. శుక్ర గ్రహ సంచారాన్ని బట్టి సతీమణి అదృష్ట దురదృష్టాల గురించి చెప్పాల్సి ఉంటుంది. శుక్రుడు అనుకూలంగా ఉన్న పక్షంలో సతీమణికి తప్పకుండా అదృష్టం పడుతుంది. సతీమణి వల్ల యోగం పట్టే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం శుక్రుడు ఈ నెల నుంచి జనవరి 2 వరకు స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఏ రాశిలోనూ 28 రోజులకు మించి ఉండని శుక్రుడు ఏకంగా వంద రోజుల పాటు తన స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకర రాశులకు వారి సతీమణులకు కొన్ని రకాల అదృష్టాలు కలుగుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 22, 2026 | 4:56 PM

Share
మేషం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలోనే సంచారం చేయడం వల్ల ఈ రాశి వారి సతీమణికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దాంపత్య జీవితం సుఖ సంతోఫాలతో సాగిపోతుంది. సతీమణికి ఒకటి రెండు పర్యాయాలు ధన యోగాలు కలుగుతాయి. మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. గృహ, వాహన యోగాలు పట్టడానికి అవకాశం ఉంది. వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి.

1 / 6
మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడు స్వస్థాన సంచారం వల్ల, దాంపత్య జీవితం మరింత సుఖ ప్రదం అవుతుంది. దంపతుల మధ్య ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయి. సతీమణికి ఉద్యోగ జీవితంలో ఉన్నత పదవులు లభిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఒక ప్రముఖురాలిగా గుర్తింపు లభిస్తుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో శుక్ర సంచారం  వల్ల, జీవిత భాగస్వామికి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో కీలక మైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధువుల్లో ఆధిపత్యం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభించి పదోన్నతులు కలుగు తాయి. జీత భత్యాలు పెరుగుతాయి. సంతాన యోగం పడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

3 / 6
కన్య: ఈ రాశికి కుటుంబ స్థానంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషా లతో సాగిపోతుంది. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభించడం, పురోగతికి అవకాశాలు పెరగడం వంటివి జరుగుతాయి. వృత్తి జీవితంలో పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారి సతీమణి ఏ రంగంలో ఉన్నా శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యో గులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. దాంపత్య, కుటుంబ జీవితాలు సుఖసంతోషాలతో సాగిపోతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. విదేశీయానానికి అవకాశం లభిస్తుంది. విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది.

5 / 6
మకరం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల, వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. దాంపత్య జీవితం సుఖ సంతో షాలతో సాగిపోతుంది. జీవిత భాగస్వామి కారణంగా ఈ రాశివారికి అదృష్టాలు కలుగుతాయి. శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, విభేదాలున్నా తొలగిపోతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

6 / 6
Follow Us