AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా

సీనియర్ హీరోయిన్ లక్ష్మీ గుర్తున్నారా.? ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఆమె.. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన నరసింహ, మురారి, హరికృష్ణ నటించిన లాహిరిలాహిరి లాహిరిలో, మిధునం సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు లక్ష్మీ.

సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా
Actress Lakshmi
Rajeev Rayala
|

Updated on: Jul 30, 2026 | 10:36 AM

Share

సీనియర్ నటి లక్ష్మీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు లక్ష్మీ. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన లక్ష్మీ ఎక్కువగా అమ్మ, అత్తా పాత్రలతో మెప్పించారు. అలాగే బామ్మగానూ మెప్పించారు లక్ష్మీ.  ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు ఈ సీనియర్ నటి. మురారి, మిథునం, ప్రేమించు, లాహిరి లాహిరి లాహిరిలో, చింతకాయల రవి, మిథునం, ఓ బేబి, నాని గ్యాంగ్ లీడర్, ఖుషి వంటి సినిమాల్లో ఆమె సహాయక నటిగా మెప్పించింది. అయితే ఇప్పుడంటే ఆమె ఇలాంటి పాత్రలు పోషిస్తుంది కానీ ఒకప్పుడు తెలుగు నాట స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు లక్ష్మీ. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు తదితర స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. తన అందం, అభినయంతో తిరుగులేని హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది. వందలాది సినిమాల్లో నటించిన లక్ష్మి తన అభినయ ప్రతిభకు ప్రతీకగా నంది, ఫిల్మ్ ఫేర్ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెలుచుకున్నారు.

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ నటి మేనల్లుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోనా..!! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

అయితే సినిమాల్లో సక్సెస్ అయిన లక్ష్మీ  వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వివాహం విషయంలో అనేక ఇబ్బందులు  మూడు సార్లు వివాహం చేసుకున్నారు లక్ష్మీ. ఈ సంగతి పక్కన పెడితే లక్ష్మీ కూతురు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోంది. ఆమె మరెవరో కాదు ఐశ్వర్య భాస్కరన్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అతన్ని భరించడం నా వల్ల కాదు.. పెళ్లయిన నాలుగు నెలలకే భర్తపై నటి షాకింగ్ పోస్ట్..

ఐశ్వర్య భాస్కరన్ చాలా పాపులర్ నటి.. ఆమె పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో రవితేజ పిన్నిగా యాక్ట్ చేసింది లక్ష్మీ కూతురే. అయితే తల్లి లాగే ఐశ్వర్య కూడా కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. జగపతి బాబు అడవిలో అభిమన్యుడు, మామగారు , ప్రేమ జిందాబాద్, రాజేంద్ర ప్రసాద్‌తో సుబ్బారాయుడు, పెళ్లంటే నూరేళ్ల పంట, సీతాపతి చలో తిరుపతి, బ్రహ్మ వంటి సినిమాల్లో కథానాయికగా నటించింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన నాని సినిమాలోనూ ఆమె నటించారు. ఇప్పటికీ పలు సినిమాల్లో ఆమె కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు ఐశ్వర్య భాస్కరన్. ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించిన ఐశ్వర్య భాస్కరన్ కూడా భర్త నుంచి విడిపోయారు. ప్రస్తుతం కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు ఆమె..

ఇది కూడా చదవండి : ఆ డైరెక్టర్ నన్ను వద్దు అన్నాడు.. కానీ హీరోయిన్ వల్లే ఇదంతా జరిగింది.. షాకింగ్ విషయం చెప్పిన నందిని రెడ్డి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us