ఆ డైరెక్టర్ నన్ను వద్దు అన్నాడు.. కానీ హీరోయిన్ వల్లే ఇదంతా జరిగింది.. షాకింగ్ విషయం చెప్పిన నందిని రెడ్డి
సినీరంగంలో లేడీ డైరెక్టర్ గా తనదైన ముద్ర వేశారు నందినీ రెడ్డి. అలా మొదలైంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత ఓ బేబీ మూవీతో మరోసారి సక్సెస్ అయ్యారు. రీసెంట్ గా సమంత ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం మూవీతో మరో హిట్ అందుకున్నారు నందిని రెడ్డి.

ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతుంది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ రంగ ప్రవేశం, తొలి అడుగుల గురించి కీలక విషయాలను పంచుకున్నారు. ఆమె తల్లి అప్పటికే ఒక పబ్లిక్ పర్సన్ కావడంతో, నందిని రెడ్డి సినీ రంగ ప్రవేశం పెద్ద ఆశ్చర్యమేమీ కాదని ఆమె పేర్కొన్నారు. అయితే, కృష్ణవంశీ టీమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే అసలైన సవాళ్లు ఎదురయ్యాయని ఆమె వివరించారు. దర్శకుడు కృష్ణవంశీ మొదట ఆమెను తన అసిస్టెంట్ డైరెక్టర్‌గా తీసుకోవడానికి నిరాకరించిన విషయాన్ని బయటపెట్టారు. కృష్ణవంశీ తనను వద్దనడానికి కారణం తాను ఒక అమ్మాయి కావడం అని నందిని రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ల టీమ్ లో సాధారణంగా కుర్రాళ్ళు ఉంటారని, షూటింగ్‌ల సమయంలో ఒకే రూంలో బస చేయడం, ఎండలో కష్టపడటం, రాత్రి ప్రయాణాలు వంటివి ఒక మహిళకు ఇబ్బందికరంగా ఉండవచ్చని ఆయన భావించినట్లు చెప్పారు నందిని. రసూల్ అనే అసిస్టెంట్ ద్వారా ఈ విషయం తనకు తెలిసిందని, కృష్ణవంశీ “వద్దు” అన్నారని తెలిపారు.
ఇదికూడా చదవండి : అమ్మబాబోయ్.. ఇదెక్కడి మార్పు రా మావ..!! ఈ చిన్నది ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్
ఈ నిరాకరణతో నిరాశపడకుండా.. నందిని రెడ్డి కన్నడ సినిమా పరిశ్రమలో ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. సందీప్ చౌతా ద్వారా ఒక కన్నడ దర్శకుడు ఆమెకు అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ సమయంలోనే ఆమెకు నటి రమ్యకృష్ణ పరిచయం అయ్యారని.. బెంగళూరు వెళ్లే ప్రణాళిక గురించి నందిని రెడ్డి చెప్పగా, రమ్యకృష్ణ ఆశ్చర్యపోయి, కన్నడ రానప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నావని, కృష్ణవంశీని మళ్ళీ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
ఇదికూడా చదవండి :ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
అప్పటికి కృష్ణవంశీ, రమ్యకృష్ణ ప్రేమలో ఉన్నారని, రమ్యకృష్ణ వెంటనే కృష్ణవంశీకి ఫోన్ చేసి “అతన్ని టార్చర్” చేసి, నందిని రెడ్డికి అవకాశం ఇవ్వమని ఒత్తిడి చేశారని నందిని రెడ్డి వెల్లడించారు. ఈ సంఘటన చంద్రలేఖ సినిమాకు ముందే జరిగిందని, ఆ సినిమానే తన మొదటి చిత్రమని ఆమె పేర్కొన్నారు. కృష్ణవంశీ నందిని రెడ్డిని చంద్రలేఖ సినిమాకు పబ్లిసిటీ ఇన్-ఛార్జ్‌గా నియమించారు. ఆనాడే, తనను కసురుకుంటూ తీసుకున్న కృష్ణవంశీ, తాను మానేసినప్పుడు బాధపడే స్థాయికి తన పనితీరును తీసుకెళ్లాలని నందిని రెడ్డి ఛాలెంజ్ చేసుకున్నారు. ఖడ్గం సినిమా సమయానికి ఆమె కృష్ణవంశీ టీమ్ నుంచి వైదొలిగారు. అనూహ్యంగా, కొంతకాలానికి కృష్ణవంశీ ఆమెకు ఫోన్ చేసి, కొత్త అసిస్టెంట్లతో ఇబ్బంది పడుతున్నానని, వచ్చి సహాయం చేయమని కోరారు. లొకేషన్‌కు వెళ్లి, కొత్త అసిస్టెంట్లకు ఆయనకు ఏం కావాలో వివరించి, ట్రైనింగ్ ఇవ్వడంలో నందిని రెడ్డి సహాయపడ్డారు. అలా కృష్ణవంశీతో ఆమె ప్రయాణం కొనసాగింది. తర్వాత కృష్ణవంశీనే ఆమెను సురేష్ బాబుకు పరిచయం చేయగా, ఆమె కెరీర్ అలా మొదలైంది వరకు సాగిందని వివరించారు. సినీ పరిశ్రమకు ముందు నందిని రెడ్డి ఒక మంచి క్రికెట్ ప్లేయర్ అని, అప్పట్లో మహిళా క్రికెట్‌కు ప్రస్తుతం ఉన్నంత గుర్తింపు లేకపోవడంతో ఆ మార్గంలో కెరీర్‌ను కొనసాగించలేదని తెలిపారు. చిన్నతనం నుండి సినిమాలు అంటే ఇష్టమైనా, తాను సినీ పరిశ్రమలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి :ఎప్పుడూ లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు..! ఒక్కసారి ఈ పాట విను మావ.. ఒళ్లు పులకరించిపోతుంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




