సైలెంట్ అయిపోయిన కుర్రభామ కళ్యాణి ప్రియదర్శన్ 

30 September  2026

Rajeev 

Pic credit - Instagram

సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్.

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ కుమార్తెగా సినీ కుటుంబంలో పుట్టిన ఆమె.. నటిగా ఎంట్రీ ఇవ్వకముందే సినిమా నిర్మాణంలోని వివిధ విభాగాల్లో పనిచేసింది.

ఆ తర్వాత హీరోయిన్‌గా మారి తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.

కళ్యాణి ప్రియదర్శన్ 2017లో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘హలో!’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. హీరోయిన్‌గా తొలి సినిమాతోనే గుర్తింపు రావడంతో వరుస అవకాశాలు వచ్చాయి.

టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కళ్యాణి మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అక్కడ వరుస సినిమాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవడం ద్వారా తన కెరీర్‌ను విభిన్నంగా మలుచుకుంది.

2025లో వచ్చిన కొత్త లోక కళ్యాణి కెరీర్‌లో కీలకమైన సినిమాగా నిలిచింది. ఈ సినిమా కళ్యాణికి కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.